మంచిర్యాల జిల్లాలో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రైవేటు ఆసుపత్రిలో దందా కూడా ఎక్కువే అవుతుంది. రీసెంట్ గా బ్లాక్ లో అధిక ధరలకు మందులు అమ్ముతున్న ముఠాను అరెస్ట్ చేసిన మంచిర్యాల పోలీసులు.. తాజాగా రహస్యంగా కోవిడ్ టెస్టులు నిర్వహిస్తున్న ముఠాను అరెస్ట్ చేశారు. జిల్లాలో ప్రైవేటు ల్యాబ్ లు డయాగ్నస్టిక్ లలో అనుమతి లేకుండా కోవిడ్ టెస్టులు నిర్వహిస్తున్నారు. బాధితుల వద్ద నుండి ఒక్కో కోవిడ్ టెస్ట్ కు 3 వేలు వసూలు చేస్తున్నారు. హెల్త్ కేర్ ల్యాబ్, పద్మావతి డయాగ్నస్టిక్ సెంటర్, అమరావతి సర్జికల్స్ కు చెందిన ఆరుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి లక్ష పదిహేను వేల విలువ చేసే 460 కోవిడ్ టెస్టింగ్ కిట్లు స్వాధీనం చేసుకున్నట్లు మంచిర్యాల ఏసీపీ అఖిల్ మహజన్ వెల్లడించారు.
మంచిర్యాల జిల్లాలో మరో ముఠా అరెస్ట్
