Site icon NTV Telugu

Dharmapuri Brahmotsavam: నేటి నుండి ధర్మపురి బ్రహ్మోత్సవాలు..

Sharmapuri Bramhostavalu

Sharmapuri Bramhostavalu

Dharmapuri Brahmotsavam: జగిత్యాల జిల్లాలో నేటి నుంచి ధర్మపురి లక్ష్మీ నరసింహస్వామి వార్ల వార్షిక బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నారు. ఈరోజు నుండి ఏప్రిల్ 01 వరకు ఈ బ్రహ్మోత్సవాలు జగనున్నాయి. ఈరోజు పాల్గుణ శుద్ధ ఏకాదశిన అంకురార్పణ వరాహ తీర్థం, పుట్ట బంగారంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. రేపు గురువారం రోజున గోధూళి సుముహూర్తమున ముగ్గురు స్వామి వార్ల కల్యాణం జరగనుంది. ఈనెల 24, 25, 26 తేదీల్లో ముగ్గురు యోగ, ఉగ్ర, వెంకటేశ్వర స్వామివార్లతెప్పోత్సవం-డోలోత్సవం నిర్వహించనున్నాయి. 29న ముగ్గురు స్వామి వార్ల రథోత్సవం ఉంటుంది. 30,31 ఎప్రిల్ 1 న స్వామి వార్ల ఏకాంతోత్సవాలు
అన్ని ఏర్పాట్లు చేసిన ఆలయ అధికారులు వెల్లడించారు.

Read also: Warangal – Ice Cream: వరంగల్ లో దారుణం.. ఐస్ క్రీమ్ లో మూత్రం, వీర్యం..!

నేడు ప్రారంభం కానున్న ధర్మపురి శ్రీలక్ష్మీ నరసింహ స్వామి బ్రహ్మోత్సవాలకు సంబంధించిన ఏర్పాట్లను ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మండల నాయకులతో కలిసి పరిశీలించారు. ఏర్పాట్లపై ఆలయ అధికారులను అడిగి తెలుసుకున్నారు. ధర్మపురి బ్రహ్మోత్సవాలకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశామని అన్నారు. నూతన ఉత్సవ కమిటీ సభ్యులు సమన్వయంతో పనిచేసి ఏర్పాట్లను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని మండల పలు పార్టీ వారు కోరారు. నాయకులు, కార్యకర్తలు, ఆలయ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
Shahid Kapoor: విజయ్ దేవరకొండకు స్టేజ్ పైనే ముద్దుపెట్టిన షాహిద్ కపూర్..పిక్ వైరల్..

Exit mobile version