NTV Telugu Site icon

Sammakka Saralamma: మేడారం సమ్మక్క సారలమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు..!

Sammakka Sarakka Jatara

Sammakka Sarakka Jatara

Sammakka Saralamma: మేడారం సమ్మక్క సారలమ్మ దర్శనానికి భక్తులు పోటెత్తారు. ఆదివారం సెలవు దినం కావడంతో వనదేవతల దర్షనానికి భక్తులు భారీగా తరలివచ్చారు. దీంతో సమక్క సారాలమ్మ ఆలయం ప్రాంగణం భక్తులతో కిక్కిరిసింది. మహాజాతర ముగిసిపోయి నెల గడిచినా భక్తుల రద్దీ మాత్రం తగ్గడం లేదు. ఇవాళ గొర్రెల బలి, బంగార(బెల్లం) లతో భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. దీంతో మునుగు జిల్లాలో రోడ్లన్నీ భక్తులతో కిటకిటలాడాయి. అమ్మవార్ల దర్శనానికి భక్తులు తరలిరావడంతో ఆలయ ప్రాంగణమంతా అమ్మవార్ల నామస్మరణతో మారిమ్రోగింది. జాతర పరిసరాలు భక్తజన సంద్రంగా మారాయి. వివిధ ప్రాంతాల నుండి వచ్చిన భక్తులు అమ్మవారికి బెల్లం (బంగారం) సమర్పిస్తున్నారు. ఉదయాన్నే గుడిసెలు వేసి ముంగిల వద్ద రంగవల్లులను అందంగా అలంకరించారు.

Read also: RangaReddy: ఆర్టీసీ బస్సులో రూ.16 లక్షల నగదు.. సీజ్‌ చేసిన అధికారులు

వనదేవతలకు బెల్లం, చీరలు, ఒడిబియ్యం సమర్పించి మొక్కులు చెల్లించుకుంటున్నారు. పరవశిస్తు అమ్మవార్ల ఆశీస్సుల కోసం భక్తులు పూనకాలతో గద్దెల వద్దకు చేరుకుంటున్నారు. దీంతో మేడారం జనసందోహంతో కిటకిటలాడింది. ఆధ్యాత్మిక భక్తితో మార్మోగింది. ఇక మరోవైపు మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు వచ్చే భక్తులు గట్టమ్మను తప్పక దర్శించుకోవడం ఆనవాయితీ. గట్టమ్మ వద్ద ఆగి దర్శనం చేసుకోకపోతే సమ్మక్క సారలమ్మ ప్రార్థనలు చెల్లవని నమ్మకం. గట్టమ్మ సమ్మక్క తల్లికి అంగరక్షకురాలిగా, కాకతీయ రాజులతో జరిగిన యుద్ధంలో గట్టమ్మ తల్లి మేడారం పొలిమేరలో ఉండి వీరోచితంగా పోరాడి మేడారం పరిరక్షించిందని చెబుతారు.
Loksabha Election 2024: నేడు 8 లోక్ సభ స్థానలకు అభ్యర్థులను ప్రకటించనున్న కాంగ్రెస్