Rangareddy Crime: ఓ డిగ్రీ విద్యార్థిని ఉరివేసుకొని మృతి చెందిందన ఘటన రంగారెడ్డి జిల్లాలో సంచలనంగా మారింది. అయితే అది ఆత్మహత్య? లేక హత్య? అన్న కోణంలో పోలీసులు కూడా దర్యాప్తు జరుపుతున్నారు. ప్రస్తుతానికి బాధితుల ఇచ్చిన ఫిర్యాదుతో షాద్ నగర్ పొలీస్ స్టేషన్లో 306 సెక్షన్ కింద కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించినట్టు పోలీసులు పేర్కొంటున్నారు.
Read also: High Interest: అధిక వడ్డీతో వేధింపులు.. సెల్ఫీ వీడియో తీసి బాధితుడు ఆత్మహత్య..
రంగారెడ్డి జిల్లా ఫరూక్ నగర్ మండలం కందివనం గ్రామంలో మానస అనే డిగ్రీ విద్యార్థిని నిన్న అనుమానాస్పద స్థితిలో మరణించింది. ఉరి వేసుకున్న పరిస్థితుల మధ్య మానస కనిపించడం.. అదే గ్రామానికి చెందిన సమీప బంధువు రాములు అక్కడే ఉండడం కుటుంబ సభ్యులకు అనుమానాలు వ్యక్తం చేశారు. కుటుంబ సభ్యులు, గ్రామస్తులు నిలదీస్తే తనకు ఫోన్లు చేసే వాడినని చెప్పడంతో అనుమానం మరింత బలపడింది. రాములు.. మానసను రెండో వివాహం చేసుకునేందుకు వేధించడం పట్ల మానస తట్టుకోలేక ఆత్మహత్యకు పాల్పడిందని బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సిఐ ప్రతాప్ లింగం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు. బాధితుల ఇచ్చిన ఫిర్యాదుతో షాద్ నగర్ పొలీస్ స్టేషన్లో 306 సెక్షన్ కింద కేసు నమోదు చేసినట్లు తెలిపారు.
అదేవిధంగా మృతి పట్ల అనుమానాలు ఉండడంతో శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించినట్లు పేర్కొన్నారు. కేసులో అనుమానాలు ఉండడంతో మెరుగైన నివేదిక కోసం ఉస్మానియాకు తరలించినట్లు బాధితులు పేర్కొంటున్నారు. కాగా.. కందివనం గ్రామానికి చెందిన విద్యార్థిని మానసది హత్యేనని షాద్ నగర్ యువ సత్తా యూత్ అధ్యక్షులు లక్ష్మణ్ కుమార్ ఆరోపించారు. పట్టణంలోని విజ్ఞాన్ డిగ్రీ కళాశాలలో డిగ్రీ చదువుతున్న మానస అనుమానాస్పద స్థితిలో మరణించినప్పుడు రాములు అక్కడే ఉన్నాడని అతనే ఈ ఘాతుకానికి పాల్పడి ఉంటాడని ఆరోపించారు.
Raja Singh: దమ్ముంటే అడ్డుకోండి.. పోలీసులకు రాజాసింగ్ సవాల్..