NTV Telugu Site icon

Deccanmall Demolition: డెక్కన్ భవనం కూల్చివేత.. బిల్డింగ్ ఒకపక్కకు ఒరిగే అవకాశం..!

Deccanmall Demolition

Deccanmall Demolition

Deccanmall Demolition:సికింద్రాబాద్‌ మినస్టర్‌ రోడ్‌ లోని డెక్కన్‌ స్పోర్ట్స్‌ భవనం కూల్చివేత పనులు నిన్న అర్థరాత్రి 11 గంటల నుంచి 2 గంటలకు వరకు కొనసాగించారు. అనంతరం రాత్రి 2 గంటల తర్వాత కూల్చివేత పనులు తాత్కాలికంగా నిలిపివేశారు. బిల్డింగ్ పటిష్టత 70 నుంచి 80 శాతం కోల్పోవడంతో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేపట్టారు. ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా.. బిల్డింగ్ ఒకపక్కకు ఒరిగే అవకాశం ఉండటంతో అధికారులు పకడ్బంది చర్యలు చేపట్టారు. డెక్కన్ మాల్ లోని రెండు సెల్లార్స్ ని పటిష్టం చేస్తూ.. ఇంజినీర్లు ర్యాంప్ ఏర్పాటు చేశారు. ర్యాంప్ నిర్మాణం పూర్తి చేశారు. ఇవాళ తిరిగి ఉదయం 6.50 నిమిషాల నుంచి కూల్చివేత పనులు ప్రారంభించారు అధికారులు. హైడ్రాలిక్‌ క్రషర్‌ డిమాలిషన్‌ విధానంలో ఈ భవనాన్ని కూల్చివేయనున్నారు. ఎలాంటి అడ్డంకులు లేకపోతే.. 5 రోజుల్లో బిల్డింగ్ మొత్తాన్ని కూల్చేసే అవకాశం ఉంటుందని తెలిపారు అధికారులు.

Read also: Ukraine Crisis: ఉక్రెయిన్‌పై ఆగని రష్యా దాడులు.. 11 మంది మృతి

కూల్చివేత పనులను షార్ట్‌టెండర్‌లో ఎస్‌కే మల్లు ఏజెన్సీకి అప్పగించారు. కానీ హైడ్రాలిక్ క్రషర్ ద్వారా కూల్చివేత దశలో ఉన్న ఈ భవనాన్ని కూల్చేందుకు సరైన మిషనరీ లేకపోవడంతో అధికారులు కృష్ణప్రసాద్ ఏజెన్సీకి పనులు అప్పగించారు. గురువారం రాత్రి జపాన్ నుంచి హెరిచ్ కాంబీ క్రషర్ మిషన్ తెప్పించి ఆరో అంతస్తు నుంచి కూల్చివేత పనులు ప్రారంభించారు. ఈ భవనాన్ని కూల్చివేయడానికి పదిహేను రోజుల గడువు ఇచ్చారు. ఈ భవనంలోని ఆరో అంతస్తు నుంచి కూల్చివేత పనులు ప్రారంభమయ్యాయి. కూల్చివేతకు జపాన్‌కు చెందిన హెరిచ్ కాంబి క్రషర్ యంత్రాన్ని ఉపయోగిస్తున్నారు. భవనంలోని పిల్లర్లు, కాలమ్‌లను మిషన్‌తో కత్తిరించి భవనాన్ని కూల్చివేయనున్నారు. అయితే దక్కన్ బిల్డింగ్ కూల్చివేతలో జీహెచ్‌ఎంసీ, రెవెన్యూ, అగ్నిమాపక, పోలీసు అధికారులు సంయుక్తంగా పాల్గొన్నారు. సమీపంలోని బస్తీ గృహాలు, వ్యాపార సంస్థలకు ఎలాంటి నష్టం జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకున్నారు.
Friday Special LIVE: భక్తుల కోరికలు తీర్చే కామధేను లాంటి స్తోత్ర పారాయణం..