NTV Telugu Site icon

DCP Rahul Hegde: నేనెక్కడా తప్పు చేయలేదు.. డింపుల్ ప్రవర్తన అభ్యంతరకరం

Rahul Hegde On Dimple

Rahul Hegde On Dimple

DCP Rahul Hegde Responds On Dimple Hayati Issue: పార్కింగ్ వ్యవహారంలో సినీ నటి డింపుల్ హయాతి, డీసీపీ రాహుల్ హెగ్డే మధ్య వివాదం నెలకొన్న విషయం తెలిసిందే! ఈ వ్యవహారంలో డింపుల్‌పై క్రిమినల్ కేసు కూడా నమోదైంది. అయితే.. డింపుల్‌పై తప్పుడు కేసు పెట్టారని, ఆమెను వేధించడమే డీసీపీ ఉద్దేశమని డింపుల్ తరఫు న్యాయవాది బాంబ్ పేల్చారు. అటు.. డింపుల్ సైతం తనపై తప్పుడు కేసు పెట్టారని, తానెప్పుడూ డీసీపీని ఇబ్బంది పెట్టలేదని పేర్కొంది. ఈ నేపథ్యంలోనే డీసీపీ రాహుల్ హెగ్డే స్పందించారు. తాను ఎలాంటి తప్పు చేయలేదని, తన పట్ల డింపుల్ ప్రవర్తించిన తీరు అభ్యంతకరమైందని ఆయన కుండబద్దలు కొట్టారు.

Mahesh Babu: మహేష్ బాబు సుఖానికి అలవాటు పడ్డాడా.. ఏంటీ నిందలు

డీసీపీ రాహుల్ హెగ్డే మాట్లాడుతూ.. ‘‘నేను, డింపుల్ ఒకే అపార్ట్‌మెంట్‌లో ఉంటున్నాం. నా కారుకు అడ్డంగా డింపుల్ కారు పెట్టారు. నాకు అర్జెంట్‌గా బయటకు వెళ్లే పని ఏర్పడి, నేనే వ్యక్తిగతంగా వెళ్లి కారు తీయాలని రిక్వెస్ట్ చేశాను. కానీ.. డింపుల్ నా పట్ల దురుసుగా ప్రవర్తించింది. నా కారుని ఢీకొట్టడంతో పాటు కాళ్లతో తన్నింది. నా పట్ల డింపుల్ ప్రవర్తన తీరు తీవ్ర అభ్యంతరకరమైనది. ఈ ఘటనపై నా డ్రైవర్ బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. డింపుల్ చేసిన ట్వీట్ పూర్తిగా అభ్యంతరకరం. నేను ఎక్కడా తప్పు చేయలేదు. నిజాలు నిలకడమీద బయటకు వస్తాయి’’ అంటూ చెప్పుకొచ్చారు. కేవలం కారు తీయమన్న పాపానికి.. డింపుల్ దురుసుగా వ్యవహరించిందని ఆయన ఆరోపణలు చేశారు.

Dimple Hayati Row: డింపుల్‌పై తప్పుడు కేసు పెట్టారు.. డీసీపీ ఆమెతో రాష్‌గా మాట్లాడారు

మరోవైపు.. డింపుల్ తరఫు న్యాయవాది పాల్ సత్యనారాయణ పలు ప్రశ్నలు సంధించారు. రోడ్ మీద ఉండే సిమెంట్ బ్రిక్స్ ప్రైవేట్ అపార్ట్మెంట్‌లోకి ఎలా వచ్చాయి? డింపుల్ తన కారుని పార్క్ చేసే స్థలంలోనే కోన్స్ ఎందుకు పెట్టారు? డీసీపీ స్థాయి వ్యక్తి ఒక అమ్మాయి పట్ల ఎలా ప్రవర్తించాలో తెలియదా? అమ్మాయి మీదకి వెళ్లి మాట్లాడుతారా? అంటూ రాహుల్ హెగ్డేని నిలదీశారు. తాను కేసు పెడతానని డింపుల్ చెప్పడంతో, రివర్స్‌లో ఆమెపై కేసు పెట్టారన్నారు. డింపుల్‌ని వేధించాలన్న ఉద్దేశంతోనే డీసీపీ ఇలా వ్యవహరిస్తున్నారని షాకింగ్ కామెంట్స్ చేశారు. డింపుల్ కేసు పెట్టినా పోలీసులు తీసుకోలేదని స్పష్టం చేశారు.