Dasyam Vinay Bhasker: వరంగల్ నుంచి మరోసారి మరో ఉద్యమం ప్రారంభిస్తామని బీఆర్‌ఎస్ నేత, మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ కీలక వ్యాఖ్యలు చేశారు.
కాంగ్రెస్ అమలు కాని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిందన్నారు. ఆనాడు కేసిఆర్ గాంధేయ మార్గంలో తెలంగాణ సాధించారు.. అంబేద్కర్ ఆలోచన విధానంతో పేద బడుగు బలహీనర్గాల కోసం అనేక కార్యక్రమాలు చేశారన్నారు. కోటి ఎకరాలకు సాగు నీరు.. ఇంటింటికీ తాగు నీరు ఇచ్చారని తెలిపారు. మేనిఫెస్టోలో పెట్టని అనేక పథకాలు అమలు చేశారన్నారు. పదేళ్లలో దేశంలోనే అగ్రగామి రాష్ట్రంగా తీర్చిదిద్దారన్నారు. కాకతీయుల పాలన స్ఫూర్తిగా వేలాది గొలుసుకట్టు చెరువులను పునరుద్ధరించారని తెలిపారు.
Read also: Ponguleti Srinivasa Reddy: బీఆర్ఎస్ పార్టీకి ఒక్క పార్లమెంట్ స్థానం కూడా రాదు..
చెరువులపై ఆధారపడ్డ బీసీ కులాలకు లాభసాటిగా చేశారన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారం లోకి వచ్చి మరోసారి తెలంగాణను దగా చేసిందని మండిపడ్డారు. కాకతీయ కళా తోరణం, చార్మినార్ ను అధికారిక చిహ్నం నుంచి తొలగిస్తామంటే ప్రజలు ఆగ్రహిస్తున్నారని వెల్లడించారు. ఉద్యమకారులకు సన్మానాలు చేయడం చూస్తే హంతకులే సంతాప సభకు హాజరైనట్టు ఉంది.. అమరవీరుల ఆత్మలు ఘోషిస్తున్నాయని మండిపడ్డారు. వరంగల్ నుంచి మరోసారి మరో ఉద్యమం ప్రారంభిస్తామని తెలిపారు. మరోవైపు ఉద్యమకారులను రేవంత్ రెడ్డి హైదరాబాద్ కు ఆహ్వానించి అగౌరవపరిచాడని మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ పార్టీ కార్యక్రమానికి ప్రో. కోదండ రామ్ హజరవడాన్ని ఒకసారి సమీక్షించుకోవాలన్నారు.
CM Revanth Reddy: కౌంటింగ్ విషయంలో జాగ్రత్త.. సీఎం రేవంత్ రెడ్డి జూమ్ మీటింగ్..