NTV Telugu Site icon

Cyclone Michaung on Telangana: తెలంగాణపై మిచౌంగ్ తుఫాను ప్రభావం.. జిల్లాలకు ఎల్లో అలెర్ట్

Cyclone Michaung On Telangana

Cyclone Michaung On Telangana

Cyclone Michaung on Telangana: తెలంగాణపై మిచౌంగ్ తుఫాను ప్రభావం ముంచుకొస్తుంది. తూర్పు దిశ నుంచి తెలంగాణ రాష్ట్రం వైపుకి వీస్తున్న గాలులు వీస్తున్నాయి. నేడు, రేపు రాష్ట్ర వ్యాప్తంగా ఉరుములు మెరుపుల, ఈదురు గాలులతో కూడిన భారీ వర్షాలు పడతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. తెలంగాణకు ఎల్లో, ఆరెంజ్ అలెర్ట్స్ ఐఎండి జారీచేసింది. పలు జిల్లాలకు నేడు ఎల్లో అలెర్ట్ ప్రకటించింది. భద్రాద్రి కొత్తగూడెం ఖమ్మం సూర్యాపేట నల్గొండ, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, జనగాం, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, వికారాబాద్, సంగారెడ్డి జిల్లాలో భారీ వర్షాలు కురిసే ఛాన్స్ వుందని తెలిపింది. బలమైన ఈదురుగాలులు, ఉరుములు మెరుపులతో కూడిన వర్షపాతం నమోదయ్యే ఛాన్స్ ఉంటుందని తెలిపింది ఐఎండి. ఇక రేపు రాష్ట్రానికి ఐఎండి ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది. రేపు జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, సూర్యాపేట జిల్లాలకు అతి భారీ వర్షం వుంటుందని తెలిపింది. నల్గొండ, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ జిల్లాలకు రేపు భారీ వర్ష సూచన ప్రకటించింది. ప్రజలు, రైతులు అలర్ట్ వుండాలని తెలిపింది.

Read also: Pakistan Terrorist Attack: జనంతో నిండిన బస్సుపై ఉగ్రవాదుల కాల్పులు.. 10 మంది మృతి, 25 మందికి గాయాలు

ఏపీ విద్యార్థులకు అలెర్ట్.. ఇవాళ ఏపీ వ్యాప్తంగా స్కూల్స్ కు సర్కార్ సెలవులు ప్రకటించింది.. అందుకు కారణం కూడా భారీ వర్షాలు.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మిచౌంగ్ తుఫాన్ ప్రభావం ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఈ తుఫాను నేపథ్యంలో స్కూళ్లకు ఇవాళ సెలవు ప్రకటిస్తూ ఏపీ విద్యాశాఖ నిర్ణయం తీసుకుంది..ఈ తుఫాన్ ప్రభావం వల్ల రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి.. గత రెండు రోజులుగా వర్షాలు పడుతున్నాయి.. నెల్లూరు నుంచి కాకినాడ వరకు ఉన్న కోస్తా జిల్లాలలో తుఫాను ప్రభావం అధికంగా ఉన్నందున ఆయా జిల్లాలలోని అన్ని విద్యాసంస్థలకు సెలవు ప్రకటించాలని విద్యాశాఖ కమిషనర్ సురేష్ ఆదేశాలు జారీ చేశారు. మిగతా జిల్లాలలో తీవ్రతను బట్టి కలెక్టర్లు నిర్ణయం తీసుకోవాలని సూచనలు చేశారు.. సముద్ర తీర ప్రాంతాల ప్రజలు అలెర్ట్ గా ఉండాలని అధికారులు సూచించారు..ప్రకాశం జిల్లాలు వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ఇవాళ, రేపు కూడా స్కూల్స్ లేవని సర్కార్ తెలిపింది.. ఇకపోతే ఈ తుఫాను కారణంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో మూడు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నట్లు వాతావరణ శాఖ స్పష్టం చేసింది. అటు తుఫాను నేపథ్యంలో ఏపీ ప్రజలు అలర్ట్ గా ఉండాలని సీఎం జగన్ కూడా అధికారులను అలర్ట్ చేశారు.. తీర ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు..
Bigg Boss 7 Telugu : గౌతమ్ అవుట్.. బిగ్‌బాస్ 7లో గెలిస్తే ఎంత డబ్బు వస్తుంది తెలుసా?