క్రికెట్ అంటే పిచ్చి.. అందులోనూ హైదరాబాద్ లో మ్యాచ్ జరుగుతుంటే.. అభిమానులు చూడకుండా వుంటారా.. జింఖానా గ్రౌండ్స్ లో టికెట్లు అమ్ముతున్నారని అక్కడికి వెళ్ళి గాయాలపాలయ్యారు కొందరు. అసలు టీ20 టికెట్లు ఎన్ని అమ్మారు? ఎన్ని వేల టికెట్లు బ్లాక్ లోకి వెళ్లాయి. హెచ్ సీఏ తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ మ్యాచ్‌ను మైదానంలో తిలకించడానికి ఉవ్విళ్లూరుతున్న అభిమానుల బలహీనతను కొందరు క్యాష్ చేసుకున్నారు.
రూ.1500 టికెట్‌ను బ్లాక్‌లో కొందరు రూ.9వేలకు పైగా విక్రయించారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. అయితే, అనుమానాస్పదంగా కనిపిస్తున్న కొందరు వ్యక్తులు టికెట్లు అమ్ముతుండడంతో వారికి అసలు టికెట్లు ఎలా వచ్చాయనే విషయమై శనివారం జింఖానా మైదానం పరిసరాల్లో చర్చనీయాంశంగా మారింది. టీ-20 క్రికెట్ మ్యాచ్ టికెట్లను బ్లాక్‌లో విక్రయిస్తున్న నలుగురిని ఎల్‌బీనగర్ ఎస్‌ఓటీ పోలీసులు, ఎల్‌బీనగర్ పోలీసులు వేర్వేరుగా అరెస్ట్ చేశారు.
నాగోల్ వంతెన వద్ద శనివారం రాత్రి వెయ్యి రూపాయల టికెట్‌ను బ్లాకులో రూ.5వేలకు విక్రయిస్తున్నట్లు ఎల్‌బీనగర్ పోలీసులకు సమాచారం అందింది. వంతెన వద్ద నిఘా పెట్టి నిందితులైన ఉప్పల్, రామంతాపూర్‌కు చెందిన సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు వడ్డేపల్లి రాహుల్(25)ను, ఎస్.గోపీ(26)లను అరెస్ట్ చేశారు. వారి నుంచి 4 వెయ్యి రూపాయల టికెట్లను స్వాధీనం చేసుకున్నారు.ఉప్పల్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో ఆదివారం జరిగే క్రికెట్ మ్యాచ్ చూసేందుకు వచ్చే క్రీడాభిమానుల కోసం ఆర్టీసీ ప్రత్యేక బస్సులు, మెట్రో రైళ్లు నడవనున్నాయి. మధ్యాహ్నం 2 గంటల నుంచి అర్ధరాత్రి వరకు బస్సులు నడుపుతుంది ఆర్టీసీ.