Site icon NTV Telugu

CPI State Conference: రేపటి నుంచి సీపీఐ రాష్ట్ర మహాసభలు.. 800 మంది పాల్గొనే అవకాశం

Cpi State Conference

Cpi State Conference

రాష్ట్రంలోని రంగారెడ్డి జిల్లాలోని శంషాబాద్ లో రేపటి (4న) నుంచి నాలుగు రోజుల పాటు జరిగే సీపీఐ రాష్ట్ర మహాసభలకు అత్యంత ప్రాధాన్యత ఉందని ఆ పార్టీ జాతీయ కార్యదర్శి నారాయణ వెల్లడించారు. అనంతరం మాట్లాడుతూ.. బీజేపీ మతోన్మాద శక్తులకు వ్యతిరేక కూటమి ఏర్పాటు కోసం సీఎం కేసీఆర్ చేస్తున్న ప్రయత్నాలు విజయవంతం కావాలని కావాలన్నారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి, మాజీ ఎంపీ అజీజ్ పాషాతో కలిసి రేపు సాయంత్రం శంషాబాద్ మల్లికా కన్వెన్షన్ లో రాష్ట్ర మహాసభల భారీ ఏర్పాట్లు చేశారన్నారు.

ఈ సందర్భంగా నారాయణ మాట్లాడుతూ, హైదరాబాదులో మత కల్లోలాలు సృష్టించేందుకు బీజేపీ, మజ్లీస్ పార్టీలు కుట్రలు పన్నుతున్నాయని ఆరోపించారు. శంషాబాద్ లో ఈనెల 4వ తేదీ నుండి ప్రారంభమయ్యే పార్టీ రాష్ట్ర మహాసభలను జాతీయ ప్రధాన కార్యదర్శి డి.రాజా ప్రారంభిస్తారని తెలిపారు. మహాసభలకు హాజరుకానున్న 31 జిల్లాల నుండి 800 మంది ప్రతినిధులు పాల్గొంటారని వెల్లడించారు. రేపటి నుండి 7 వ తేదీ వరకు ఈ మహాసభలు జరగనున్నాయి.

Exit mobile version