Harish Rao: మెడికల్ హబ్ గా తెలంగాణ ఎదిగిందని మంత్రి హరీశ్ రావు అన్నారు. హైదరాబాద్ నిమ్స్ దవాఖానలోని న్యూరో విభాగంలో రూ.2కోట్లతో ఏర్పాటు చేసిన అత్యాధునిక వైద్య పరికరాలను మంత్రి ప్రారంభించారు. ఎంబీబీఎస్ సీట్లు నాలుగంతలు పెంచామనిచ పీజీ సీట్లు డబుల్ చేసామన్నారు. నెలకు మూడు నాలుగు ఎయిర్ అంబులెన్స్ ఇక్కడికి వస్తున్నాయని తెలిపారు. అత్యధిక ట్రాన్స్ ప్లాంట్ జరిగేది హైదరాబాద్ లోనే అన్నారు. అరోగ్య శ్రీ కింద అత్యధికంగా 10 లక్షల వరకు ఇస్తున్నామని తెలిపారు. ఆరోగ్య శ్రీ కింద 1000 కోట్లు పేద ప్రజల వైద్యం కోసం ఖర్చు చేస్తున్నామని అన్నారు. అనవసర పరీక్షలు చేయొద్దు, అనవసర మందులు వద్దు ప్రజలపై భారం మోపొద్దని, ప్రజలపై భారం మోపొద్దు.. అనవసర పరీక్షలు, అనవసర మందులు వద్దని మంత్రి హరీశ్ రావు తెలిపారు.
Read also: Hi Mum Scam: ఆస్ట్రేలియాలో ‘హై మమ్ స్కామ్’.. వేల సంఖ్యలో ప్రజలు బలి
ప్రభుత్వ ఆసుపత్రుల్లో సింగిల్ యూజ్ ఫిల్టర్ డయాలసిస్ విధానాన్ని అందుబాటులోకి తెచ్చిన దేశంలోనే తెలంగాణ తొలి రాష్ట్రంగా నిలిచిందన్నారు. ఇంతకుముందు ఇది కార్పొరేట్ ఆసుపత్రులకే పరిమితమైంది. డయాలసిస్ చేయించుకుంటున్న వారికి బస్ పాస్, పింఛన్లు, మందులు ఉచితంగా అందజేస్తారు. డయాలసిస్‌కు ప్రభుత్వం ఏటా రూ.100 కోట్లు ఖర్చు చేస్తుందన్నారు. అత్యాధునిక వైద్య పరికరాల కోసం రూ.150 కోట్లు మంజూరు చేశామన్నారు. శుద్ధి చేసిన తాగునీటిని అందిస్తున్న తొలి రాష్ట్రం తెలంగాణ అని తెలిపారు. ప్రాథమిక దశలోనే వ్యాధులను గుర్తించి రోగాలు రాకుండా చూసుకోవాలన్నారు. చాలా వరకు కిడ్నీ ట్రాన్స్ ప్లాంటేషన్లు నిమ్స్‌లో జరుగుతుంది. నిమ్స్ ను మరింత బలోపేతం చేస్తామని వెల్లడించారు. డిస్పెన్సరీలో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయనున్నట్లు వెల్లడించారు. వైద్య సిబ్బంది యాజమాన్యంతో పనిచేసి పేదలకు మంచి వైద్యం అందించాలని మంత్రి హరీష్ రావ్ సూచించారు.
IND Vs BAN: వికెట్ పడకుండా ఆడుతున్న బంగ్లాదేశ్.. హాఫ్ సెంచరీలు చేసిన ఓపెనర్లు