గత కొన్నేళ్లు జనాలను వణికించిన కరోనా మళ్లీ మృత్యువు గంట మొగిస్తుంది.. రోజురోజుకు పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతూ వస్తుంది.. కొన్ని రాష్ట్రాల్లో కఠినమైన నిబంధనలను పాటించేలా ఆయా ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటుంది.. ఇప్పటికే కొన్ని రాష్ట్రాల్లో ఐటి కంపెనీలకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చినట్లు తెలుస్తుంది… దేశంలో కోవిడ్-19 కేసులు పెరిగిపోతున్న దృష్ట్యా సిబ్బంది తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.. ఇక మరోవైపు పాజిటివ్ కేసులు కూడా భారీగానే పెరుగుతున్నాయి..
అలాగే JN-1 వేరియంట్ కేసులు కూడా వేగంగా విస్తరిస్తున్నాయి. మరోసారి కరోనా వైరస్ డేంజర్ బెల్స్ మోగిస్తోంది. ఓవైపు కరోనా కేసులు పెరుగుతుండగా.. మరోవైపు JN-1 వేరియంట్ కేసులు కూడా భారీగా నమోదవుతున్నాయి. కొత్త వేరియంట్ JN 1 కారణంగానే దేశంలో కరోనా కేసుల్లో భారీగా పెరుగుదల కనిపిస్తోందని నిపుణులు చెప్తున్నారు.. మరోవైపు కోవిడ్ పాజిటివ్ కేసుల సంఖ్య కూడా పెరుగుతూ వస్తుంది.. 24 గంటల్లో 702 కొత్త కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం మొత్తం యాక్టివ్ కేసుల సంఖ్య 4,097కు చేరింది. కొత్తగా ఆరు మరణాలు సంభవించాయని అధికారులు చెబుతున్నారు..
జేఎన్-1 వేరియంట్‌తో భయం అవసరం లేదని డాక్టర్లు చెబుతున్నారు. సరైన జాగ్రత్తలు తీసుకుంటే వైరస్ వ్యాప్తిని అరికట్టవచ్చని సూచిస్తున్నారు. మాస్కులు తప్పనిసరిగా ఉపయోగించాలని తెలిపారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న వ్యాక్సిన్‌లతో జేఎన్ 1 వేరియంట్ నుంచి కూడా సేవ్ చేస్తుందని వైద్యులు చెబుతున్నారు.. తెలుగు రాష్ట్రాల్లో కూడా రోజురోజుకు ధరలు భారీగా పెరుగుతున్నాయి.. వేగంగా వ్యాపిస్తున్న కోవిడ్ నుంచి బయట పడటానికి స్వీయ జాగ్రత్తలు పాటించాలని సూచిస్తున్నారు..