Site icon NTV Telugu

Jagga Reddy Counter to Sharmila: మూడు రాష్ట్రాలు చేయండి.. ముగ్గురూ పంచుకోండి

Jaggareddy, Sharmila

Jaggareddy, Sharmila

jagga Reddy Counter to Sharmila: ఏపీలో మూడు రాజధానుల పంచాయతీ నడుస్తోంది.. మూడు రాజధానుల బదులు ఏపీని మూడు రాష్ట్రాలు చేయండి.. జగన్, విజయమ్మ, షర్మిల పంచుకోండి.. అర్జెంటుగా సీఎం అయిపోవాలని షర్మిలకు చాలా కోరికగా ఉందని ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఎద్దేవ చేశారు. షర్మిల వ్యవహరం చుట్టరికం తోక పట్టుకొని తిరిగినట్టు ఉందని ఎద్దేవ చేశారు. అర్జెంట్ గా షర్మిల సీఎం అయిపోవాలి అదే ఆమె కోరిక అని విమర్శించారు. విజయమ్మ కి సలహా.. జగన్ కి చెప్పి షర్మిలను సీఎం చేయండని చెప్పుకొచ్చారు జగ్గారెడ్డి. మీ ఇంటి పంచాయితీ జనంకి చుట్టకండి అంటూ మండిపడ్డారు. ఏపీలో మూడు రాజధానుల పంచాయతీ.. మీ ఇంట్లో సీఎంల పంచాయితీ నడుస్తుందని విమర్శించారు. మూడు రాజధానుల బదులు మూడు రాష్ట్రాలు చేసుకోండి అంటూ ఎద్దేవ చేశారు. జగన్ మోడీకి గులాం అయ్యారు కాబట్టి మూడు రాష్ట్రాలు చేయండని జగ్గారెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. మీ ఫ్యామిలీ అంతా మోడీ దగ్గర కూర్చొని, మూడు రాష్ట్రాలు చేసుకోండి అంతేకాని, ఊరు మీద పడతా అంటే ఎట్లా అంటూ మండిపడ్డారు జగ్గారెడ్డి. షర్మిలకి నాతో పంచాయితీ ఎందొ అర్దం అవ్వడం లేదని సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఎద్దేవ చేశారు.

షర్మిల పాదయాత్ర కాదు.. కాళ్ళు చేతులు కొట్టుకున్నా తెలంగాణ లో గెలవలేదని జగ్గారెడ్డి స్పష్టం చేశారు. తెలంగాణలో టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్ మధ్యనే పోటీ అని చెప్పుకొచ్చారు జగ్గారెడ్డి. బీజేపీ కె అర్దం అవ్వడం లేదు ఎట్లా పోవాలి అనేది! తెలంగాణలో అనవసర న్యూసెన్స్ చేస్తున్నది షర్మిల అని ఆగ్రహం వ్యక్తం చేశారు. అమ్మాయి కదా అని ఏం అనలేక పోతున్నాం అని, అంతేకాదు.. మా నాయకుడు వైఎస్ బిడ్డ కదా అని ఆలోచన చేస్తున్నామని జగ్గారెడ్డి ప్రెస్‌ మీట్‌ తెలిపారు. ఇంకా షర్మిలను ఏం అంటం అని ప్రస్తావించారు. నేను అన్ని మతాలకు సమన్వయ కర్తను, షర్మిల లెక్క బీజేపీకి ఏజెంట్ నీ కాదని మండిపడ్డారు. నన్ను ఇంకా అంటే మాత్రం చాలా విషయాలు చెప్పాల్పి వస్తుందన్నారు. షర్మిల.. జగన్ మధ్య ఆస్తుల పంపకం కూడా కానట్టుందని ఎద్దేవ చేశారు జగ్గారెడ్డి.

Exit mobile version