Site icon NTV Telugu

పీసీసీ కొత్త కమిటీలు.. అప్పటివరకు ఏం మాట్లాడను-వీహెచ్‌

VH

VH

తెలంగాణ పీసీసీ చీఫ్‌తో పాటు ఇతర కమిటీలను కూడా ప్రకటించింది కాంగ్రెస్‌ అధిష్టానం.. అయితే, ఆ కమిటీలపై తాను ఇప్పుడే ఏమీ మాట్లాడబోను అంటున్నారు కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత, మాజీ ఎంపీ వి. హనుమంతరావు.. గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో ఆస్పత్రిలో చికిత్స పొందిన ఆయన.. ఈ మధ్యే డిశ్చార్జ్‌ అయి ఇంటికి చేరుకున్నారు.. ఇక, చాలా కాలం తర్వాత మీడియాతో మాట్లాడుతూ.. ఆస్పత్రిలో తనను కలవడానికి వచ్చిన అందరికీ కృతజ్ఞతలు తెలిపారు.. బడుగు బలహీన వర్గాల వాళ్లకి నా సేవలు అవసరమని మా సోనియాగాంధీ తెలిపారన్న ఆయన.. రాజకీయాల్లోకి సేవ చేయాలని వచ్చాను.. అంతే తప్ప డబ్బులు సంపాదించడానికి రాలేదని స్పష్టం చేశారు.

సోనియా గాంధీ నాతో మాట్లాడటం వల్ల నాకు మరింత ధైర్యం పెరిగిందన్నారు వీహెచ్.. నా మిగతా జీవితం అంత బడుగు బలహీనవర్గాలకి సేవ చేస్తానన్న ఆయన.. ఎక్కడ పేదవారికి ఆపద ఉన్నా ఆదుకునే పవన్ కల్యాణ్‌.. నా అరోగ్య విషయంలో నాకు లెటర్ రాశారని గుర్తుచేసుకున్నారు.. ఇక, పార్టీ బలోపేతానికి కృషి తన వంతు కృషి చేస్తానన్న ఆయన.. నేను ఎక్కడ ఆపద ఉన్న అక్కడ ఉంటానన్నారు.. మరోవైపు.. సోనియా గాంధీని కలిసిన తర్వాత కొత్త కమిటీ.. పాత కమిటీ గురుంచి మాట్లాడతాను.. కానీ, అప్పటివరకు ఏం మాట్లాడబోను అన్నారు వి. హనుమంతరావు.

Exit mobile version