NTV Telugu Site icon

CM Revanth Reddy: నేడు 4 లోక్‌సభ నియోజకవర్గాల్లో సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచారం..

Revanth Reddy

Revanth Reddy

CM Revanth Reddy: లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ దూసుకుపోతోంది. గడువుకు వారం రోజులు మాత్రమే ఉండడంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్రంలో సుడిగాలి పర్యటన చేస్తున్నారు. లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈరోజు నేడు కొత్తగూడెం, మహబూబ్‌నగర్, సికింద్రాబాద్, ముషీరాబాద్ నియోజకవర్గాల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. హైదరాబాద్ నుంచి కొత్తగూడెంకు ప్రత్యేక హెలికాప్టర్‌లో సీఎం రానున్నారు. ఉదయం 11 గంటలకు కొత్తగూడెం జన జాతర సభలో పాల్గొంటారు. ఇక సాయంత్రం 5 గంటలకు కొత్తకోట (మహబూబ్ నగర్) కార్నర్ మీటింగ్ లో ప్రసంగించనున్నారు. కాగా.. సాయంత్రం 6.30 గంటలకు సికింద్రాబాద్ కార్నర్ మీటింగ్ అనంతరం.. రాత్రి 8 గంటలకు ముషీరాబాద్ కార్నర్ మీటింగ్‌లో సీఎం రేవంత్‌రెడ్డి పాల్గొననున్నారు.

Read also: TSRTC Bumper Offer: ప్రయాణికులకు టీఎస్‌ఆర్టీసీ శుభవార్త.. ఇకపై ఆ చార్జీలుండవ్..

కాగా మరోవైపు సభ ఏర్పాట్లను మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పరిశీలించారు. ఎండ వేడిమి నుంచి రక్షించేందుకు జర్మన్ టెక్నాలజీతో టెంట్లను ఏర్పాటు చేశారు. కొత్తగూడెం సభ అనంతరం మహబూబ్ నగర్ అభ్యర్థి వంశీచంద్ రెడ్డికి మద్దతుగా రేవంత్ రెడ్డి ప్రచారం నిర్వహించనున్నారు. వనపర్తి జిల్లా కొత్తకోటలో భారీ ర్యాలీ నిర్వహించిన అనంతరం కార్నర్ మీటింగ్‌లో పాల్గొంటారు. ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లను పూర్తి చేసినట్లు దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి తెలిపారు. వనపర్తి పర్యటన అనంతరం రేవంత్ రెడ్డి సికింద్రాబాద్, ముషీరాబాద్ కార్నర్ మీటింగ్‌లలో కూడా పాల్గొంటారు. ఇప్పటికే ఖమ్మం నియోజకవర్గంలో జిల్లాకు చెందిన ఉప ముఖ్యమంత్రి, ఇద్దరు మంత్రులు ముమ్మరంగా ప్రచారం నిర్వహిస్తుండగా.. ముఖ్యమంత్రి సభను విజయవంతం చేసేందుకు శ్రేణులు ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నారు.

Read also: Home Voting : తెలంగాణలో ప్రారంభమైన హోం ఓటింగ్‌

ధర్మపురి, సిరిసిల్లలో జరిగిన జన జాతర సభలకు నిన్న హాజరైన సీఎం రేవంత్ బీఆర్ఎస్, బీజేపీపై విమర్శలు గుప్పించారు. పదేళ్లలో ప్రధాని మోదీ తెలంగాణకు ఏమీ ఇవ్వలేదన్నారు. తెలంగాణ ఏర్పాటును అవమానించిన భారతీయ జనతా పార్టీకి ఓటు అడిగే హక్కు లేదని దుయ్యబట్టారు. భారత రాష్ట్ర సమితి అంటే బిర్లా రంగ సమితి. రిజర్వేషన్ల రద్దు విషయంలో రెండు పార్టీలది ఒకే విధానం అని రేవంత్ రెడ్డి విమర్శించారు. ప్రపంచంలోని ప్రతి దాని గురించి కేటీఆర్ మాట్లాడతారు. కోనసీమ నుంచి చిత్రసీమ వరకు ఎక్స్ (ట్విట్టర్)లో మాట్లాడుకుంటున్నారు. రిజర్వేషన్లు రద్దు చేయాలని బీజేపీ ప్రయత్నిస్తుంటే ట్విట్టర్ ఎందుకు ప్రశ్నించడం లేదు? రిజర్వేషన్ల రద్దు విషయంలో బీఆర్‌ఎస్‌, బీజేపీలది ఒకే విధానం. 2022లో రాజ్యాంగాన్ని మార్చాలని చెప్పిన కేసీఆర్.. రిజర్వేషన్ల రద్దు కోసం ఎదురుచూడలా? ఎన్నికల తర్వాత భారతీయ జనతా పార్టీతో కలిసేందుకు గులాబీ పార్టీ సిద్ధంగా ఉందన్నారు.
AP Pensions: మరో వృద్ధుడి ప్రాణాలు తీసిన పెన్షన్‌..!