NTV Telugu Site icon

Nirmal Collectorate: నిర్మల్‌ కలెక్టరేట్‌ను ప్రారంభించనున్న సీఎం.. ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి

Indrakaran Reddy

Indrakaran Reddy

Nirmal Collectorate: సీఎం కేసీఆర్ వచ్చే నెల 4న నిర్మల్ జిల్లాలో పర్యటించనున్నారు. జిల్లా కేంద్రంలో నూతనంగా నిర్మించిన సమీకృత కలెక్టరేట్‌, బీఆర్‌ఎస్‌ పార్టీ కార్యాలయాన్ని సీఎం ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ వరుణ్ రెడ్డి, మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పరిశీలించారు. ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. అనంతరం మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ జిల్లా కేంద్రంలో లక్ష మందితో నిర్వహించే భారీ బహిరంగ సభలో సీఎం కేసీఆర్ పాల్గొంటారన్నారు. ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా ఎల్లపల్లి గ్రామ శివారు క్రషర్ రోడ్డులో సభ నిర్వహిస్తున్నామని, తొమ్మిదేళ్లుగా ప్రజలకు అందిస్తున్న పలు కార్యక్రమాలపై ముఖ్యమంత్రి ప్రసంగిస్తారని తెలిపారు. ప్రజలకు సుపరిపాలన అందించేందుకు సీఎం కేసీఆర్‌ కొత్త జిల్లాలు ఏర్పాటు చేసి ప్రతి జిల్లా కేంద్రంలో సమీకృత కలెక్టరేట్‌ సముదాయ భవనాలను నిర్మించారన్నారు.

Read also: Rahul Gandhi: “ఇది పట్టాభిషేకం”.. కొత్త పార్లమెంట్ ప్రారంభంపై రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు

ప్రజలు పెద్దఎత్తున సభకు తరలిరావాలని సీఎం కేసీఆర్ పిలుపునిచ్చారు. జూన్ 2లోగా పనులన్నీ పూర్తి చేయాలని అన్నారు. ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. సభకు వచ్చే ప్రజలకు, ప్రజాప్రతినిధులకు పార్కింగ్ ఏర్పాటు చేయాలని మంత్రి ఆదేశించారు. ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా సరైన రూట్లలో ట్రాఫిక్ డైవర్ట్ చేయాలని సూచించారు. ప్రయాణికులు పోలీసులకు సహకరించాలని కోరారు. ఎండ ఎక్కువగా ఉండటంతో షామియాలను భారీ ఏర్పటు చేయాలని అధికారులకు ఆదేశించారు. సభకు వచ్చే ప్రజలకు ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా అధికారులు చర్యలు చేపట్టలని కోరారు. సభకు వచ్చే ప్రజలకోసం నీరు, మజ్జిగ ప్యాకెట్లను ఏర్పటు చేయాలని తెలిపారు. కాగా .. టిఎస్ ఆర్టిసి నిర్మల్ ప్రయాణికుల ప్రాంగణాన్ని కమర్షియల్ కాంప్లెక్స్ గా మార్చేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవడం జరుగుతుందని చెప్పారు..

నిర్మల్ లో నిర్మించే టిఎస్ఆర్టిసి కమర్షియల్ కాంప్లెక్స్ ప్రత్యేకతలు ఇవి..

1. 1.3 ఎకరాలలో అత్యాధునిక హంగులతో మెరుగైన సౌకర్యాలతో కమర్షియల్ కాంప్లెక్స్ ను నిర్మించడం జరుగుతుంది.
2. ఈ కమర్షియల్ కాంప్లెక్స్ లో పార్కింగ్ సదుపాయం కోసం సెల్లార్ మరియు జి ప్లస్ వన్ నిర్మాణం జరుగుతుంది.
3. నిర్మల్ టిఎస్ఆర్టిసి ప్రయాణికుల ప్రాంగణాన్ని కమర్షియల్ కాంప్లెక్స్ గా నిర్మాణం చేయడానికి కోసం టిఎస్ ఆర్టిసి యాజమాన్యం 35 కోట్ల నిధులను సమకూర్చుకోవడం జరుగుతుంది.
4. కమర్షియల్ కాంప్లెక్స్ లో శుభకార్యాలు నిర్వహించేందుకు హాలును ప్రత్యేకంగా నిర్మాణం చేయడం జరుగుతుంది.
5. బస్టాండ్ కమర్షియల్ కాంప్లెక్స్ లో ఆర్టిసి ప్రయాణికుల కోసం 53 స్టాళ్లను నిర్మాణం చేయడం జరుగుతుందని చెప్పారు.
6. ప్రయాణికుల సౌకర్యార్థం మరుగుదొడ్లు మరియు వెయిటింగ్ హాల్స్, బస్సుల కోసం వేచి ఉన్న వారికోసం ఎల్సిడి తెరలు కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది.
7. ప్రయాణికుల భద్రత కోసం టిఎస్ ఆర్టిసి ప్రత్యేక చర్యలు తీసుకోవడం జరుగుతుంది.
8. మరో 10 తరాలకు అడ్వాన్సుగా ఈ యొక్క కమర్షియల్ కాంప్లెక్స్ ను నిర్మాణం చేయడం జరుగుతుందని చెప్పారు.
9. టిఎస్ ఆర్టిసి బస్టాండుల యొక్క ఆధునికరించుకోవడం వల్ల ప్రయాణికులను ఆకట్టుకోవడం జరుగుతుందని, ప్రయాణికులు కూడా ప్రైవేటు బస్సులను ఆశ్రయించకుండా టిఎస్ఆర్టిసి అందిస్తున్న ప్రత్యేక రాయితీలు మరియు బస్సు సర్వీసులను ఆదరించాలని మరోసారి సంస్థ చైర్మన్, శాసనసభ్యులు శ్రీ బాజిరెడ్డి గోవర్ధన్ గారు విజ్ఞప్తి చేశారు..
10. అదనపు ఆదాయ వనరులే మార్గంగా టిఎస్ఆర్టిసి ప్రత్యేక దృష్టి సాధించిందని, దీనికి రాష్ట్ర ప్రజలందరూ సహకారం ఉండాలని తెలియజేశారు.
గౌరవ దేవాదాయ మరియు అటవీ శాఖ మంత్రివర్యులు శ్రీ ఇంద్రకరణ్ రెడ్డి గారితో సమీక్ష సమావేశంలో ఆర్టిసి అధికారులు ఈడిఈ వినోద్ కుమార్ గారు, సిటిఎం విజయ్ కుమార్ గారు, సీసీఈ రాంప్రసాద్, సివిల్ ఇంజనీర్ మహేష్ గారు ఇతర ఆర్టీసీ ఉన్నత అధికారులు పాల్గొన్నారు.
Rahul Gandhi: “ఇది పట్టాభిషేకం”.. కొత్త పార్లమెంట్ ప్రారంభంపై రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు