Site icon NTV Telugu

CM KCR : ఢిల్లీకి వెళ్లొచ్చిన మంత్రులతో భేటీ..

Telangana CM K Chandra Shekar Rao Meeting With TRS Minister.

ధాన్యం కొనుగోళ్లపై టీఆర్‌ఎస్‌ వర్సెస్‌ బీజేపీ అన్నట్లు సాగుతోంది. పంజాబ్‌ రాష్ట్రంలో కొనుగోలు చేస్తున్నట్లుగానే తెలంగాణలోనూ పూర్తిగా ధాన్యం కొనుగోలు చేయాలని టీఆర్‌ఎస్‌ మంత్రులు నిన్న కేంద్రమంత్రి పీయూష్‌ గోయల్‌ భేటీ అయ్యారు. ఈ సమావేశంలో తెలంగాణ నుంచి యాసంగి ధాన్యం మొత్తం కొనుగోలు చేయాలని తెలంగాణ మంత్రులు నిరంజన్‌ రెడ్డి, గంగుల కమలాకర్‌, వేముల ప్రశాంత్‌రెడ్డి, పువ్వాడ అజయ్‌, ఎంపీ నామానాగేశ్వర రావు లతో పాటు తదితరులు వినతి పత్రం అందజేశారు. అయితే పీయూష్‌ గోయల్‌ ఇప్పటికే పరిస్థితులకు అనుగుణంగా కేంద్రం ధాన్యం కొనుగోలు చేస్తుందని వెల్లడించారు.

ఈ నేపథ్యంలో నిన్న పీయూష్‌ గోయల్‌తో భేటీ అనంతరం తెలంగాణ మంత్రులు తిరిగి హైదరాబాద్‌కు చేరుకున్నారు. ఈ క్రమంలో నేడు సీఎం కేసీఆర్‌ ఢిల్లీ వెళ్లొచ్చిన మంత్రుల బృందంతో ప్రగతి భవన్‌లో భేటీ కానున్నారు. వరి ధాన్యం కొనుగోలు అంశంపై ఢిల్లీలో జరిగిన పరిణామాలను సీఎం కేసీఆర్‌కు మంత్రుల బృందం వివరించనుంది. అయితే ఇప్పటికే ప్రగతి భవన్ కు మంత్రులు నిరంజన్ రెడ్డి, గంగుల కమలాకర్,పువ్వాడ అజయ్, వేముల ప్రశాంత్ రెడ్డిలు చేరుకున్నారు.

https://ntvtelugu.com/sri-sri-daughter-mala-has-been-appointed-as-a-judge-of-the-madras-high-court/
Exit mobile version