Chirmarthi Lingaiah: కోమటిరెడ్డి సోదరులపై నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమూర్తి లింగయ్య తొలిసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. నల్గొండ జిల్లా నకిరేకల్ మండలం పాలెం, నోముల గ్రామాల్లో చిరుమూర్తి లింగయ్య ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా కోమటిరెడ్డి సోదరులను ఉద్దేశించి ఘాటు వ్యాఖ్యలు చేశారు. కోమటిరెడ్డి బ్రదర్స్ తనను భౌతికంగా లేకుండా చేసే కుట్రలు చేస్తున్నారనీ ఆరోపించారు. నకిరేకల్ సిట్టింగ్ ఎమ్మెల్యే, ప్రస్తుత బీఅర్ఎస్ పార్టీ అభ్యర్ధి చిరుమర్తి లింగయ్య… తాను డబ్బులకు అమ్ముడుపోయీ పార్టీ మారానని కోమటిరెడ్డి బ్రదర్స్ చేస్తున్న ఆరోపణలు ఆయన తీవ్రంగా ఖండించారు. కాంట్రాక్టుల కోసం పార్టీ మారిన చరిత్ర నాకు లేదని చేరుమర్తి లింగయ్య ఘాటుగా రియాక్ట్ అయ్యారు… ఏడాది కాలంలో రెండు పార్టీలు ఎందుకు మారారో దేనికోసం మారారో ప్రజలందరికీ తెలుసని ఆయన అన్నారు కోమటిరెడ్డి బ్రదర్స్ బ్లాక్ మెయిలింగ్ పాలిటిక్స్ కు కేరాఫ్ అని డబ్బులకు టికెట్లు అమ్ముకున్న చరిత్ర కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిదనీ తనపై అనవసర ఆరోపణలు, విమర్శలు, కోమటిరెడ్డి బ్రదర్స్ మానుకోకపోతే నకిరేకల్ వదిలేసి మునుగోడులో రాజగోపాల్ రెడ్డిని, నల్గొండలో వెంకట్ రెడ్డిని ఓటమికోసం పనిచేస్తానని చిరుమర్తి లింగయ్య శపథం చేశారు.
2014 ఎన్నికల్లో తన ఓటమికి కోమటిరెడ్డి సోదరులే కారణమని లింగయ్య ఆరోపించారు. పైగా.. తనకు మంత్రి పదవి రాకుండా చేసింది వాళ్లేనని ఆరోపించారు. ప్రజల సొమ్మును దోచుకుంటున్నారని, డబ్బుతో రాజకీయాలు చేస్తున్నారని కోమటిరెడ్డి సోదరులపై చిరుమూర్తి లింగయ్య తీవ్ర పదజాలంతో విరుచుకుపడ్డారు. దళితుడైనందుకే తనను ఓడించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. 2009 అసెంబ్లీ ఎన్నికల్లో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిపై నకిరేకల్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ ఎమ్మెల్యేగా చిరుమూర్తి లింగయ్య గెలుపొందారు. ఆ తర్వాత 2014లో పోటీ చేసినా ఓడిపోయారు. 2018లో మూడోసారి ఎమ్మెల్యేగా పోటీ చేసి విజయం సాధించారు. ఇప్పటి వరకు రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. అయితే ఈ ఎన్నికల్లో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఓడిపోయారు.
కాంగ్రెస్ పరిస్థితి మరింత దిగజారింది. అందుకే తనకు అండగా నిలిచిన కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి బదులు చిరుమర్తి లింగయ్య బీఆర్ఎస్ పార్టీలో చేరారు. అప్పటి వరకు కోమటిరెడ్డి సోదరుల బాటలోనే నడిచిన చిరుమూర్తి ఒక్కసారిగా ధైర్యం చేసి విడిపోయారు. నాటి నుంచి నేటి వరకు అదే దూరం పాటిస్తున్నారు. అయితే తెలంగాణలో మారిన రాజకీయ పరిస్థితులకు అనుగుణంగా నకిరేకల్ నియోజకవర్గంలోనూ పరిస్థితులు మారాయి. మొన్నటి వరకు ఉప్పు, నిప్పులా ఉన్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి బ్రదర్స్, వేముల వీరేశం ఒక్కటయ్యారు. కోమటిరెడ్డి ఆశీస్సులతో నకిరేకల్ నియోజకవర్గంలో వేముల ముందుకు సాగుతున్నారు. బీఆర్‌ఎస్‌లోని నేతలంతా కాంగ్రెస్‌లో మారుతున్నారు. దాంతో నియోజ క వ ర్గంలో ప రిస్థితి శ ర వేగంగా మారుతోంది. ఈ నేపథ్యంలో చిరుమూర్తి లింగయ్య సెంటిమెంట్ డైలాగులు వదులుతున్నాడని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
Siddaramaiah: ఓ రేంజ్ లో డ్యాన్స్ ఇరగదీసిన ముఖ్య మంత్రి.. కావాలంటే మీరు ఓ లుక్కేయండి