Site icon NTV Telugu

ధరణి పోర్టల్ ఫిర్యాదులపై తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం..

Somesh Kumar

తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆదేశాల మేరకు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ధరణి పోర్టల్ పై శుక్రవారం బి.ఆర్.కె.ఆర్ భవన్ లో అధికారులతో సమీక్షించారు. జిల్లా కలెక్టర్లతో సమన్వయం చేసుకుంటూ ధరణి పోర్టల్‌లో వచ్చిన ఫిర్యాదులను వీలైనంత త్వరగా పరిష్కరించాలని, ప్రతిరోజూ పెండెన్సీ స్థితిని పర్యవేక్షించాలని అధికారులను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదేశించారు. వాట్సాప్, ఈమెయిల్ లతో పాటు అందిన అన్ని ఫిర్యాదులపై స్పందించి,ఆయా ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలని ప్రధాన కార్యదర్శి తెలిపారు. భూ విషయాలకు సంబంధించిన మాడ్యూల్స్, ధరణి పోర్టల్‌, ఇతర అంశాలను ప్రధాన కార్యదర్శి సమీక్షించారు.

Exit mobile version