NTV Telugu Site icon

KCR Visit to Vikarabad: నేడు వికారాబాద్‌కు కేసీఆర్‌, నూతన కలెక్టరేట్‌ ప్రారంభోత్సవం

Kcr Visit To Vikarabad

Kcr Visit To Vikarabad

వికారాబాద్ జిల్లాలో జరిగే కేసీఆర్ పర్యటనకు భారీ ఏర్పాట్లు పూర్తీ చేసారు పార్టీ శ్రేణులు. వికారాబాద్‌ లో రూ60.70కోట్లు వెచ్చించి సమీకృత కలెక్టరేట్‌ ను సీఎం ప్రారంభించనున్నారు. అనంతరం సీఎం కేసీఆర్‌ బహిరంగ సభకు జిల్లా యంత్రాంగం భారీ ఏర్పాట్లు చేశారు.

బ్లాక్‌గ్రౌండ్‌లో ప్రత్యేకంగా హెలిప్యాడ్‌తోపాటు కలెక్టరేట్‌ వెనకాల మరో హెలిప్యాడ్‌ ఏర్పాటు చేయాలని యోచిస్తున్నారు. రాష్ట్ర సీఎం కేసీఆర్‌ బ్లాక్‌గ్రౌండ్‌లో ఏర్పాటు చేసే హెలిప్యాడ్‌కు ప్రత్యేక హెలికాప్టర్‌లో చేరుకొని, ముందుగా టీఆర్‌ఎస్‌ పార్టీ జిల్లా కార్యాలయాన్ని ప్రారంభించి, అక్కడి నుంచి జిల్లా కలెక్టరేట్‌కు చేరుకొని సమీకృత జిల్లా కలెక్టరేట్‌ను ప్రారంభించిన తర్వాత కలెక్టరేట్‌ భవనం పక్కనే గల స్థలంలో బహిరంగ సభ నిర్వహించాలని ప్రాథమికంగా నిర్ణయించారు. ఇందులో మార్పులు సైతం ఉండే అవకాశం ఉన్నదని పార్టీ శ్రేణులు తెలిపారు.

ఆగస్టు 17న మేడ్చల్-మల్కాజిగిరిలో జరిగే మరో బహిరంగ సభలో సీఎం ప్రసంగిస్తారు. ఆగస్టు నెలాఖరులో నిజామాబాద్, జగిత్యాల, పెద్దపల్లి, మహబూబ్‌నగర్, శంషాబాద్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో ఐసీసీ, టీఆర్‌ఎస్ కార్యాలయాల ప్రారంభోత్సవంతోపాటు బహిరంగ సభల్లో సీఎం ప్రసంగం వుంటుందని పార్టీ శ్రేణులు తెలిపారు.

అయితే.. సీఎం పర్యటన నేపథ్యంలో సోమవారం సాయంత్రం విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఏర్పాట్లను పర్యవేక్షించారు. వికారాబాద్‌ జిల్లాకు తొలిసారి వస్తున్న సీఎం కేసీఆర్‌కు ఘన స్వాగతం పలకడంతోపాటు బహిరంగసభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. సీఎం కేసీఆర్‌కు వికారాబాద్‌ జిల్లాపై ప్రత్యేక అభిమానం ఉన్నదని, జిల్లా సమగ్ర అభివృద్ధే లక్ష్యంగా సీఎం పలు అభివృద్ది పథకాలు మంజూరు చేస్తున్నారని తెలిపారు.

ఈనేపథ్యంలో.. వికారాబాద్‌ లో కేసీఆర్‌ పర్యటనను బీజేపీ నేతలు అడ్డుకుంటామనడంతో తీవ్ర దుమారం రేపుతోంది. ఈ పరిణామాల మధ్య కేసీఆర్‌ వికారాబాద్‌ పర్యటనపై సర్వత్రా ఉత్కంఠంగా మారింది.