Site icon NTV Telugu

CM KCR: మరికాసేపట్లో నిజామాబాద్‌కు సీఎం కేసీఆర్‌.. ప్రగతిభవన్‌ నుంచి హెలిక్యాప్టర్‌లో..

Cm Kcr

Cm Kcr

CM KCR: ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు నేడు నిజామాబాద్ జిల్లాకు వెళ్లనున్నారు. మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తన తల్లి అంత్యక్రియల్లో పాల్గొనేందుకు ఉదయం 9 గంటలకు హెలికాప్టర్‌లో ప్రగతి భవన్‌కు బయలుదేరి వెళ్లనున్నారు. ఉదయం 10 గంటలకు జిల్లాలోని వేల్పూర్‌కు సీఎం చేరుకుంటారు. మంత్రి ప్రశాంత్‌రెడ్డి తల్లి అంత్యక్రియలు ఈరోజు ఉదయం 11 గంటలకు వేల్పూర్‌లో నిర్వహించనున్నారు.

రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తల్లి వేముల మంజులమ్మ(77) గురువారం కన్నుమూశారు. ఆమె అనారోగ్య కారణాలతో హైదరాబాదులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేరారు. కొంత కాలంగా చికిత్స తీసుకుంటూ కాసేపటి క్రితమే మరణించారు. వారి స్వగ్రామం వేల్పూర్ నందు ఇవాళ ఉదయం అంతక్రియలు జరుగుతాయి. వేముల ప్రశాంత్ రెడ్డి రెండు సార్లు బాల్కొండ నియోజక వర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. ప్రశాంత్ రెడ్డి తల్లి మరణ వార్త విన్న నేతలు, అభిమానులు సంతాపం ప్రకటించారు. సాగు నీటి రంగంలో పునర్జీవం పథకం ద్వారా 300 కిలో మీటర్ల దూరంలోని కాళేశ్వరం జలాలను తెచ్చి ఎస్సారెస్పీలో పోసుకోవడంతో పాటు ప్రాజెక్టు పరిధిలో రైతులకు, బాల్కొండ, ఆర్మూర్‌ నియోజక వర్గాల్లోని లక్ష్మీ కెనాల్‌, గుత్ప, చౌట్‌పల్లి హన్మంత్‌ రెడ్డి, తదితర ఎత్తిపోతల పథకాలకు నీటికి కొదవ లేకుండా చేశారు. ఎస్సారెస్పీకి దూరంగా ఉండే భీమ్‌గల్‌, మోర్తాడ్‌, వేల్పూర్‌, కమ్మర్‌పల్లి మండలాల్లో 80 వేల ఎకరాలకు సాగు నీరందించే ప్యాకేజీ- 21తో కాళేశ్వరం జలాలను తెచ్చి కప్పల వాగులో పారించుకోవడం తనకు ఎనలేని ఆనందాన్ని అందించారు.
KA Paul: టికెట్ కావాలంటే 10 వేలు గూగుల్ పే చేయండి.. పాల్‌ ఆఫర్..

Exit mobile version