NTV Telugu Site icon

Adilabad Cheetah: ఆదిలాబాద్‌ లో చిరుత సంచారం..

Adilabad Chiruta

Adilabad Chiruta

Adilabad Cheetah: ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలం కుచిలాపూర్ శివారులో చిరుత పులి సంచారం కలకలం రేపుతుంది. మూడు రోజులుగా తెలంగాణ మహారాష్ట్ర సరిహద్దుల్లో చిరుత సంచరిస్తున్నట్లు స్థానికులు గుర్తించారు. దీంతో అటవీ శాఖ సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో అధికారులు అలర్ట్ అయ్యారు. తాజాగా అటవీశాఖ అధికారులు బిగించిన ట్రాప్ కెమెరాల్లో చిరుతు చిక్కింది. అయితే ఇటీవల ఓ ఎద్దు, రెండు మేకలను చిరుత పులి చంపిందని గుర్తించారు. దీంతో స్థానికులు హడలెత్తు తున్నారు. పులులు జన సచారంలో వస్తు మూగ జీవాలపై దాడులు చేస్తున్నాయని వాపోతున్నారు. బయట తిరగాలంటేనే భయమేస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తు్న్నారు. చిన్నారులు కూడా ఆరుబయట ఆడుకుంటారని వారిపై చిరుత దాడి చేస్తే ఎలా అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Read also: Toxic Liquor: తమిళనాడులో 55కి చేరిన మృతుల సంఖ్య.. 88 మందికి చికిత్స..!

నెలలు గడుస్తున్నా నెలలో ఒకరోజైనా చిరత సంచారాన్ని అధికారులు ఆపలేకపోతున్నారని మండిపడుతున్నారు. ఇప్పటికైనా అధికారులు వెంటనే స్పందించి చిరుతను పట్టుకోవాలని కోరుతున్నారు. ఇప్పుడు మూగ జీవాలపై దాడి చేస్తుందని వాపోయారు. అయితే చిరుత సంచారంతో అలర్ట్ అయిన అటవీశాఖ అధికారులు ప్రజలు జాగ్రత్తగా ఉండాలని తెలిపారు. ఊరు బయట, ఆరు బయట పిల్లలను ఒంటరిగా వదల కుండా జాగ్రత్తగా ఉండాలని సూచించారు. చిరుత కోసం గాలిస్తునట్లు తెలిపారు. త్వరలోనే చిరుతను బంధిస్తామని అన్నారు. చిరుతను పట్టుకునేందుకు ఆపరేషన్ కొనసాగుతుందని అన్నారు. స్థానిక ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు.
Vizag Steel plant: విశాఖ ఉక్కు ఆస్తుల అమ్మకానికి రంగం సిద్ధం(వీడియో)