NTV Telugu Site icon

Challa Vamshi Reddy: డీకే.అరుణ నా ఫోన్ లిప్ట్ చేయలేదు.. చల్లా సంచలన వ్యాఖ్యలు

Challa Vamshi Chand Reddy

Challa Vamshi Chand Reddy

Challa Vamshi Chand Reddy: అరుణమ్మ నాసవాళ్ళు స్వీకరించి టైం ప్లేస్ చెప్పమందని, దానికోసం నేను ఆమెతో నేరుగా మాట్లాడే ప్రయత్నం చేసానని, కానీ.. డీ.కె.అరుణ తన ఫోన్ లిప్ట్ చేయడం లేదని కాంగ్రెస్ ఏఐసీసీ కార్యదర్శి చల్లా వంశీచంద్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. గత రెండు మూడు రోజులుగా ఇక్కడ జరుగతున్న రాజకీయ పరిణామాలు ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. ప్రస్తుత భారతీయ జనతా పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు 2019 ఎన్నికల్లో 15 కోట్లు డిమాండ్ చేసిందని ప్రస్తావించానని అన్నారు. ఈరోజు నేను స్థానిక ఎమ్మెల్యే యెన్నెం శ్రీనివాస్ రెడ్డి, వాకిటి శ్రీహరితో కలిసి టీచర్స్ కాలనీలో గల రామాలయంకు వచ్చానని అన్నారు. తను ఈరోజు మల్లీ అదే ప్రమాణం చెపుతున్నాను 2019 పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు డబ్బులు డిమాండ్ చేసిందన్నారు. నిజాయితీగా రాములవారి సాక్షిగా ప్రమాణం చేసి చెపుతున్నా ఆమె డబ్బులు డిమాండ్ చేసిందని అన్నారు. రాముడిని కోరుకుంటున్నా మాఅందరికీ నీతి నిజాయితీగా రాజకీయాలు చేసే బుద్ది ప్రసాదించాలని కోరారు. నీతి నిజాయితీ ఎవరివైపు వున్నారో ప్రజలు గమనిస్తున్నారని తెలిపారు.

Read also: Hardik Pandya: నాకు ఆ మైదానం గుడితో స‌మానం: హార్దిక్ పాండ్యా

తను ఎప్పుడూ కూడా రాజకీయ పరంగా ఆమె కన్నా ఉన్నత పదవుల్లో వున్నానని అన్నారు. ఎప్పుడూ కూడా ఆమె ఎదుగదలను చూసి ఓర్వలేదన్నారు. నేను వచ్చినా వంద మంది వచ్చినా నిజం నిజమే కదా? అన్నారు. రాముల వారి సమక్షంలో ప్రమాణం కన్నా ఆమె తప్పు చేసిందని చెప్పడానికి పెద్ద సాక్ష్యం లేదన్నారు. హిందూ ధర్మంలో మన నిజాయితీని నిరూపించుకోవడానికి దేవూడిపై చేసే ప్రమాణం కన్నా ప్రామాణికత వుండదన్నారు. దేవున్ని ఎవరైతే రాజకీయ కోసం వాడుకోనున్నారో…వారే నేడు రాముడి దగ్గరకి రాలేదన్నారు. ఎప్పడూ కూడా ప్రాదేశిక సమావేశంలో డబ్బుల గూర్చి మాట్లాడే సిద్ధాంతలు నిజమైన కాంగ్రెస్ కార్యకర్తకు వుండదని తెలిపారు. నిజమైన కార్యకర్తలను వెన్నుపోటు పొడిచి స్వార్థ రాజకీయాలకు తెరలేపిన వ్యక్తి డికె అరుణ అన్నారు. పాలమూరు నుండి చెపుతున్నాను ప్రజలు ఎవరివైపు వుండాలో ఆలోచించుకోవాలని తెలిపారు. కాగా.. బీజేపీ నేత డీకే అరుణ, కాంగ్రెస్ ఏఐసీసీ కార్యదర్శి చల్లా వంశీచంద్ రెడ్డి మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఇద్దరు నేతలు పరస్పరం సవాల్‌ విసురుకుంటున్నారు. ఈ క్రమంలో.. డీకే అరుణ వ్యాఖ్యలకు వంశీచంద్ రెడ్డి గట్టి కౌంటర్ ఇచ్చిన విషయం తెలిసిందే..
EX MLA Vishweshwar Reddy: హంద్రీనీవా ప్రాజెక్టు పూర్తి చేసిన ఘనత వైఎస్సార్‌దే..