Site icon NTV Telugu

Nizamabad: చౌకబారు ప్రకటనలు మానుకోవాలి.. ఈట‌ల‌కు బాజిరెడ్డి హెచ్చరిక‌

Bagireddy

Bagireddy

ఆర్టీసీ ప్రైవేటీకరణపై చైర్మన్ బాజిరెడ్డి కీలక ప్రకటన చేశారు. నిజమాబాద్ నగరం లో సిటీ మెట్రో బస్సు సర్వీసులను ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్, అర్బన్ ఎమ్మెల్యే భిగాల గణేష్ గుప్తా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి మాట్లాడుతూ.. ఆర్టీసీని ప్రైవేట్ పరం చేస్తున్నట్లు ప్రతిపక్షాలు తప్పుడు ప్రకటనలు చేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేసారు. ఆర్టీసీని అభివృద్ధి లోకి తెచ్చే సలహాలు ఇవ్వాలి తప్పా.. చౌకా బారు ప్రకటనలు మానుకోవాలని హెచ్చరించారు.

త్వరలో 1000 కొత్త బస్సులను కొనుగోలు చేయబోతున్నామని స్పష్టం చేశారు చైర్మన్ బాజిరెడ్డి. డిపో లను ఎత్తి వేసే ఆలోచన లేదని.. ఆర్టీసీ లో కార్మికులను వేధింపులకు పాల్పదినట్లు దృష్టికి వస్తే చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు చైర్మన్ బాజిరెడ్డి. ఆర్టీసీని ప్రైవేటీకరణ అసలు చేయబోమని క్లారిటీ ఇచ్చారు. కాగా.. నిన్న హుజురాబాద్‌ బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌.. ఆర్టీసీని ప్రైవేటీకరణ చేస్తారని కేసీఆర్‌ సర్కార్ పై మండిపడ్డ సంగతి తెలిసిందే. ఆర్టీసీ కార్మికులు, సంస్థ పరిస్థితి దయనీయంగా ఉందని ఈటల ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర సాధన ఉద్యమంలో ఆర్టీసీ, సింగరేణి కార్మికులు కీలకపాత్ర పోషించారన్నారు. కానీ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటైన తర్వాత కేసీఆర్ హయాంలో కష్టాలు పడుతున్నారు. ముఖ్యమంత్రి తమను మోసం చేశారన్నారు ఈట‌ల చెప్పుకొచ్చారు. ఈట‌ల మాట‌ల‌కు చైర్మన్ బాజిరెడ్డి నేడు చుర‌క‌లంటిచారు.

Swiggy: ఆ సేవలకు స్వస్తి పలకనున్న స్విగ్గీ… 5 నగరాల్లో నిలిపివేత

Exit mobile version