రాష్ట్ర వ్యాప్తంగా డబుల్ ఓట్లు ఉన్న వారిని గుర్తించే ప్రక్రియ సాగుతోందని తెలంగాణ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ వికాస్ రాజ్ వెల్లడించారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కొత్తగా సాఫ్ట్‌వేర్, యాప్ ద్వారా ప్రక్రియ కొనసాగుతోందని, పేర్లు వేరుగా, అడ్రస్ లు వేరుగా పెట్టి డబుల్ ఓట్లు ఉంటున్నాయని ఆయన పేర్కొన్నారు. ఈఆర్వో వాటిని గుర్తించి సాఫ్ట్‌వేర్‌లో ఎంట్రీ చేస్తారన్నారు. డూప్లికేట్ ఓట్లు ఉండొచ్చు, అనివార్యకారణాల వల్ల కొన్ని ఫోటోలు వేరుగా ఉండి కూడా నమోదు అవుతున్నాయని ఆయన తెలిపారు.
కొద్ది రోజుల్లో వీటిని మొత్తం ప్రక్షాళన చేస్తామని, ఎక్కువ ఓట్లు ఉన్న చోట సమయం ఎక్కువ పట్టొచ్చు అని ఆయన అన్నారు. ఇప్పటికే పనులు స్పీడప్ అయ్యాయని, కచ్చితంగా ఫీల్డ్ లో ఉండి ఓట్లని గుర్తించాలని చెప్పామన్నారు. ఒకటి గుర్తించి మిగితా ఓట్లు తొలగించకుండా ఉండొద్దని, ఈఆర్వో వెరీఫికేషన్ చేసాకనే తొలగించడం జరుగుతుందని ఆయన పేర్కొన్నారు.
