Site icon NTV Telugu

Kishan Reddy: ఈ ఏడాది 20 లక్షల కోట్ల వ్యవసాయ రుణాలు.. కేంద్రం రుణ ప్రణాళిక

Kishan Reddy

Kishan Reddy

Kishan Reddy: ఈ ఆర్థిక సంవత్సరం లో 20 లక్షల కోట్ల వ్యవసాయ రుణాలు ఇవ్వాలని కేంద్రం రుణ ప్రణాలిక ను ఖరారు చేసిందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. రైతులకు వ్యవసాయం లాభసాటి చేసేందుకు వినూత్నమైన విధానాలను మోడీ సర్కార్ తీసుకొస్తుందని తెలిపారు. కిసాన్ సమ్మాన్ నిధి, సాయిల్ హెల్త్ కార్డ్స్, ఫసల్ భీమా యోజన లాంటి వి అమలు చేస్తున్నారని గుర్తు చేశారు. కనీస మద్దతు ధర 2014 తో పోలిస్తే 5.7 రెట్లు పెరిగిందన్నారు. బియ్యం ఎగుమతులు 109శాతం పెరిగాయన్నారు. వంట నూనెలు దిగుమతి తగ్గించామని తెలిపారు. రైతుల నుండి నూనె గింజల సేకరణ 15 వందల శాతం పెరిగిందని అన్నారు.

ఈ ఆర్థిక సంవత్సరంలో 20 లక్షల కోట్ల వ్యవసాయ రుణాలు ఇవ్వాలని కేంద్రం రుణ ప్రణాలిక ను ఖరారు చేసిందని గుర్తు చేశారు. యూరియా ఒక బస్తా పైన 2 వేల 236 రూపాయలు సబ్సిడీ కేంద్రం ఇస్తుందని అన్నారు. Dap ఒక బస్తా పైన 2422 రూపాయల సబ్సిడీ ఇస్తుందని కేంద్ర మంత్రి అన్నారు. ఒక ఎకరా ఉంటే ఏడాది కి 18 వేల 612 రూపాయల సబ్సిడీ రైతుకు లభిస్తుందని తెలిపారు. 10 ఎకరాలు ఉంటే రైతుకి ఎరువుల సబ్సిడీ ఏడాదికి లక్ష 86 వేల 120 రూపాయలు లభిస్తుందని అన్నారు. తెలంగాణ లో 39 లక్షల మంది రైతులకు కిసాన్ సమ్మాన్ నిది అందుతుందని స్పష్టం చేశారు. ఎరువుల మీద 27 వేల కోట్ల సబ్సిడీ తెలంగాణ రైతులకు కేంద్రం అందించిందని అన్నారు. ఎరువుల కొరత లేకుండా చేసిందని గుర్తు చేశారు. పాడి,మత్స్య పరిశ్రమల కు చేయూత నిస్తుందని తెలిపారు.

Read also: Vistara Airline: పెరిగిన విస్తారా ఎయిర్‌లైన్ సిబ్బంది.. తగ్గిన యూనిఫాం

ప్రధాని నరేంద్ర మోదీ జన్మస్థలం గుజరాత్‌లోని వాద్‌నగర్‌ను కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి కిషన్‌రెడ్డి బుధవారం సందర్శించిన విషయం తెలిసిందే.. పురాతన పట్టణం యొక్క గొప్ప చరిత్రను వెలుగులోకి తెచ్చే “అనంత్ అనాది వాడ్‌నగర్” డాక్యు-సిరీస్ ప్రదర్శనను పురస్కరించుకుని కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి వాద్‌నగర్‌లోని రైల్వే స్టేషన్ మరియు ఇతర పురాతన ప్రదేశాలను సందర్శించారు. కేంద్ర పర్యాటక శాఖ ప్రత్యేకతను చాటేందుకు పలు కార్యక్రమాలు నిర్వహిస్తోంది. పురాతన పట్టణం మరియు దాని గొప్ప చరిత్ర. ఇందులో భాగంగా అనంత్ అనాది వడ్ నగర్ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. గత 2700 సంవత్సరాల నుండి వాద్‌నగర్‌లో ప్రజలు నివసిస్తున్నట్లు సంకేతాలు ఉన్నాయి. ఈ చారిత్రాత్మక పట్టణం వాద్‌నగర్‌ను భారతదేశంలోని మథుర, ఉజ్జయిని, పాట్నా, వారణాసి వంటి చారిత్రక జీవన నగరాలతో పోల్చవచ్చన్నారు.
Health: పారాసిటమాల్‌తో సహా 14 డ్రగ్స్‌పై నిషేధం

Exit mobile version