NTV Telugu Site icon

TS Inter Exams: టెన్షన్‌ వద్దు.. ‘సెంటర్‌ లొకేటర్‌’ యాప్‌తో ఎగ్జామ్‌ సెంటర్‌కు వెళ్లడం ఇక ఈజీ

Ts Inter Exams

Ts Inter Exams

TS Inter Exams: మీరు ఇంటర్ పరీక్షలకు హాజరవుతున్నారా? పరీక్షా కేంద్రం తెలియక టెన్షన్‌ పడుతున్నారా? కేంద్రం స్థానాన్ని తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే, గూగుల్ ప్లే స్టోర్ నుండి ‘సెంటర్ లొకేటర్’ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి. అందులో మీ పరీక్షా కేంద్రం నంబర్‌ను నమోదు చేయండి.. పరీక్షా కేంద్రానికి సులభంగా చేరుకోండి.. హాయిగా పరీక్ష రాయండి. ఇంటర్మీడియట్ పరీక్షలు బుధవారం నుంచి ప్రారంభం కానుండగా, ద్వితీయ పరీక్షలు గురువారం నుంచి ప్రారంభం కానున్నాయి.

రాష్ట్రంలో మార్చి 15 నుంచి నిర్వహించనున్న ఇంటర్ పరీక్షలకు ఎలాంటి సమస్యలు తలెత్తకుండా ఏర్పాట్లు పూర్తి చేసినట్లు మంత్రి సబితా తెలిపారు. జిల్లా స్థాయి కమిటీ ఛైర్మన్లుగా కలెక్టర్లు బాధ్యతతో వ్యవహరించి పరీక్షల నిర్వహణలో ఎలాంటి లోటుపాట్లు తలెత్తకుండా చూడాలని సూచించారు. ఇంటర్మీడియట్ పరీక్షలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు అసవరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. రాష్ట్రవ్యాప్తంగా 1,473 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశామని ఈ పరీక్షలకు 9 లక్షల 47 వేల 699 మంది విద్యార్థులు హాజరవబోతున్నట్లు మంత్రి సబితాఇంద్రారెడ్డి తెలిపారు. విద్యార్థుల సౌకర్యార్థం రెండు కంట్రోల్ రూమ్ నంబర్లు 040-24601010 మరియు 040-24644027 ఏర్పాటు చేయబడ్డాయి. ఎప్పటిలాగే నిమిషం నిబంధన ఉంటుందని, ఆలస్యంగా వచ్చే విద్యార్థులను అనుమతిస్తామని అధికారులు హెచ్చరించారు. గైర్హాజరైన విద్యార్థుల సమాచారాన్ని సేకరించేందుకు మరో యాప్ అందుబాటులోకి వచ్చింది.

రేపటి నుంచి ఇంటర్‌ పరీక్షలు ప్రారంభం కానుండగా, ఇంటర్ విద్యార్థులు భయాందోళనలకు లోను కాకుండా పరీక్షలకు హాజరై విజయం సాధించాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి తెలిపారు. ఇంటర్మీడియట్ పరీక్షల నిర్వహణపై జిల్లా కలెక్టర్లతో వీడియో కన్ఫరెన్స్ నిర్వహించారు. ఇటర్మీడియట్ పరీక్షలకు విద్యార్థులు తీవ్ర ఒత్తిడికి లోనుకాకుండా చూడాల్సిన బాధ్యత ఆయా యాజమాన్యాలతో పాటు అధ్యాపకులకు, తల్లిదండ్రులకు ఉందన్నారు. పరీక్షలపై స్టూడెంట్స్ కు ఉన్న సందేహాలను ఎప్పటికప్పుడు నివృతి చేసి వారిలో ధైర్యాన్ని నింపాలని మంత్రి సబితాఇంద్రారెడ్డి కోరారు.
Telangana BJP: బండి సంజయ్ పై మరో తిరుగుబాటు.. అధిష్టానానికి కన్నం అంజయ్య ఫిర్యాదు