Site icon NTV Telugu

మంత్రి సబిత డిశ్చార్జ్ పిటిషన్‌పై సీబీఐ కౌంటర్‌ !

sabitha indra reddy

పెన్నా కేసులో మంత్రి సబిత డిశ్చార్జ్ పిటిషన్‌పై సీబీఐ కౌంటర్‌ దాఖలు చేసింది. మంత్రిగా సబిత ప్రమేయంపై ఆధారాలున్నాయని.. కేసులో ఆమెను తొలగించవద్దని కోరింది. మరోవైపు నిమ్మగడ్డ ప్రసాద్ డిశ్చార్జ్ పిటిషన్లపై కౌంటరు దాఖలుకు గడువు కోరింది సీబీఐ. ఇందూ టెక్ జోన్ కేసు విచారణ ఈనెల 20కి వాయిదా వేసింది. అటు సీబీఐ కోర్టులో ఓబుళాపురం గనుల కేసుల విచారణ జరిగింది. ఓఎంసీ కేసు అభియోగాల నమోదుపై మంత్రి సబిత వాదనలు వినిపించారు. ఓఎంసీ కేసులో తనపై అభియోగాలు నిరాధారమని.. వాటిని కొట్టివేయాలని కోరారు. కేసు విచారణ రేపటికి వాయిదా వేసింది సీబీఐ కోర్టు.

Exit mobile version