బ్రిక్స్ ఇన్‌ఫ్రాటెక్ నిర్మాణ అనుమతులు రద్దు చేయాలని హైకోర్టు లో పిటిషన్ దాఖలు అయింది. భూ యజమానులు పిటిషన్ దాఖలు చేశారు. శేరిలింగంపల్లి మండలం గోపన్‌పల్లి గ్రామంలోని సర్వే నంబర్ 177లో ఉన్న బీ 499 నుంచి బీ 501 ప్లాట్‌లలో భవన నిర్మాణ అనుమతులు రద్దు చేయాలని పిటీషన్ దాఖలు అయింది. బ్రిక్స్ ఇన్‌ఫ్రాటెక్ కంపెనీ భాగస్వాములు తమ అక్రమించారని పిటీషన్ దాఖలు చేశారు. భూవివాదం తేలేవరకు జీహెచ్ఎంసీ అధికారులు ఇచ్చిన నిర్మాణ అనుమతులు రద్దు చేయాలని పిటీషనర్లు కోరారు. భవన నిర్మాణ అనుమతులు రద్దు చేయాలని కోరుతూ జీహెచ్ఎంసీలో సంబంధిత అధికారులకు దరఖాస్తు చేయాలని పిటిషనర్లకు హైకోర్టు సూచించింది. పిటిషనర్ల దరఖాస్తును పరిశీలించి తగిన నిర్ణయం తీసుకోవాలని జీహెచ్ఎంసీలో సంబంధిత అధికారులకు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.
బ్రిక్స్ ఇన్‌ఫ్రాటెక్ నిర్మాణ అనుమతులు రద్దు చేయండి.. హైకోర్టు లో పిటిషన్. !
