NTV Telugu Site icon

MLA Raja Singh: రాజస్థాన్‌ లో రాజాసింగ్‌పై కేసు.. 153 ఏ ఎఫ్‌ఐఆర్‌ నమోదు

Raja Singh

Raja Singh

MLA Raja Singh: గోషామహల్ ఎమ్మెల్యే, బీజేపీ బహిష్కృత నేత రాజాసింగ్‌ పై మరోకేసు నమోదైంది. ఈసారి రాజస్థాన్ లో కేసు నమోదు కావడంపై సంచలనంగా మారింది. ఏదో ఒక వివాదంలో ఇరుక్కునే హైదరాబాద్ గోషామహల్ ఎమ్మెల్యే, బీజేపీ బహిష్కృత నేత రాజాసింగ్‌పై మరో కేసు నమోదు కావడంతో హాట్ టాపిక్ గా మారింది. మతి విద్వేషాలు రెచ్చగొట్టేలా ప్రసంగించారన్న ఆరోపణలతో ఆయనపై కేసు నమోదైంది. రాజాస్థాన్ పోలీసులు ఈ కేసును ఫైల్ చేశారు. మహారాణా ప్రతాప్ వర్ధంతి కార్యక్రమంలో పాల్గొనేందుకు రాజాసింగ్ ఇటీవల రాజస్థాన్ వెళ్లారు. అయితే అక్కడి ప్రతాప్ చౌక్‌లో ఆయన ప్రసంగించారు. కున్హాడి పోలీసు స్టేషన్ పరిధిలో ఈ సభ నిర్వహించగా రాజాసింగ్ మత విద్వేషాలు రెచ్చగొట్టేలా మాట్లాడారంటూ కున్హాడి పోలీసులు 153 ఏ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఇక గతంలోనూ రాజాసింగ్‌పై పలు పోలీసు స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. ముంబైలోనూ ఆయనపై కేసు నమోదైంది. అయితే.. ఈ ఏడాది జనవరి 29న ముంబైలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఇక ఆ సభలో మత విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యల చేశారంటూ ఓ వ్యక్తి పోలీసులకు కంఫ్లైంట్ ఇచ్చాడు. ఈ మేరకు ముంబై పోలీసులు రాజాసింగ్‌పై ఐపీసీ సెక్షన్ 153 ఏ 1 (ఏ) కింద ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు.

Read also: TS EAMCET Results 2023: ఎంసెట్ ఫలితాలు విడుదల.. https://ntvtelugu.com లో చెక్ చేసుకోండి

గతేడాది ఆగస్టులో హైదరాబాద్‌ నగరంలో ఏర్పాటు చేసిన స్టాండప్ కమెడియన్ మునావర్ ఫారూఖీ షో నిర్వహణపై రాజాసింగ్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆయన షోకు వ్యతిరేకంగా మహ్మద్ ప్రవక్తపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ ఓ వీడియోను రాజాసింగ్ సోషల్‌ మీడియాలో విడుదల చేశారు. ఆ వీడియోపై హైదరాబాద్‌తో పాటు దేశవ్యాప్తంగా పలువురు ముస్లింలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్‌లోని పలు పోలీసు స్టేషన్లలో రాజాసింగ్‌కు వ్యతిరేకంగా ఫిర్యాదులు చేశారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ పోలీసులు రాజాసింగ్‌పై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఆయనపై పీడీ యాక్ట్ విధించి జైలుకు పంపించారు. అనంతరం ఆయన షరతులతో కూడిన బెయిల్‌పై విడుదలయ్యారు. ఇక మహ్మద్ ప్రవక్తపై రాజాసింగ్ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ అదిష్ఠానం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆయన్ను బీజేపీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించింది. రాజాసింగ్ బీజేపీ తెలంగాణ శాసనసభపక్షనేతగా ఉండగా.. ఆయన్ను తొలగించారు. బీజేపీ అదిష్ఠానం తనపై ఉన్న సస్పెన్షన్ ఎత్తివేస్తే.. వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తానని ఆ తర్వాత ఆయన ప్రకటించారు. ఆయన టీడీపీలోకి వెళ్తున్నారని కొన్నాళ్ల క్రితం ప్రచారం జరగ్గా.. ఆ వార్తలను రాజాసింగ్ కొట్టిపడేశారు. తన రక్తంలో పారుతోంది హిందూ రక్తమేనని.. బీజేపీ కార్యకర్తగా పార్టీ సిద్దాంతాలకు కట్టుబడి ఉంటానంటూ రాజాసింగ్ వ్యాఖ్యలు చేశారు.
Russia: కీవ్ నగరంపై రష్యా దాడి.. అర్థరాత్రి డ్రోన్లతో బీభత్సం..

Show comments