Bullet Bandi Song Fame Ashok Redhandedly Caught In ACB Raids: అప్పట్లో ఓ పెళ్లి వేడుకలో ‘నీ బుల్లెట్టు బండెక్కి వచ్చేస్తావా’ అనే పాటకు పెళ్లికూతురు వేసిన స్టెప్పుల వీడియో ఎంత వైరల్ అయ్యిందో అందరికీ గుర్తుండే ఉంటుంది. ఆ పాట పుణ్యమా అని.. అందులో ఉన్న వధూవరుల జోడీ బాగా పాపులర్ అయ్యింది. ఆ వీడియోలో ఉన్న అశోక్ ఇప్పుడు ఏసీబీ దాడుల్లో అడ్డంగా దొరికిపోయాడు. రూ. 30 వేలు లంచం తీసుకుంటుండగా.. ఏపీబీ అధికారులకు రెడ్‌హ్యాండెడ్‌గా బుక్కయ్యాడు.
Read Also: Cyber Attack: మెయిల్ ఐడీ హ్యాక్.. మిథానికి రూ.40 లక్షలు టోకరా..
మహేశ్వరం నియోజకవర్గంలోని బడంగ్‌పేట్ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో బుల్లెట్ బండి పాట ఫేమ్ అశోక్ ఓ టౌన్ ప్లానర్‌గా పని చేస్తున్నాడు. జిల్లాలగూడకు చెందిన దేవేందర్‌రెడ్డి ఇంటి అనుమతుల కోసం ప్రైవేట్ ఆర్కిటెక్చర్, గత ఎన్నికల్లో అధికార పార్టీ నుంచి కార్పొరేటర్‌గా పోటీ చేసి ఓడిపోయిన శ్రీనివాస్‌రాజును సంప్రదించగా రూ.50,000/ లంచం డిమాండ్ చేశాడు.. దీంతో, ఏసీబీ అధికారులని సంప్రదించాడు.. ఈరోజు రూ.30 వేలు లంచం తీసుకుంటుండగా.. రెడ్ హ్యాండెడ్‌గా అశోక్ మరియు శ్రీనివాస్ రాజు ఇద్దరినీ అదుపులోకి తీసుకున్నారు ఏసీబీ అధికారలు.. ఇక, నాగోల్‌లోని అశోక్ ఇంట్లో ఏసీబీ సోదాలు కొనసాగుతున్నాయి.. అప్పుడు బుల్లెట్ బండి పాటతో బాగా పాపులర్ అయిన అశోక్.. ఇప్పుడు ఏసీబీ బండెక్కి మరోసారి వార్తల్లోకెక్కాడు. టౌన్ ప్లానింగ్ సూపర్ వైజార్ అశోక్ కి ఇంటి అనుమతుల కోసం వచ్చే వారికి మధ్య శ్రీనివాస్ రాజు మధ్యవర్తిగా వ్యవహరిస్తున్నారని.. దేవేందర్ రెడ్డి గృహ నిర్మాణ అనుమతుల కోసం వస్తే రూ. 50 వేలు లంచం డిమాండ్ చేయగా మొదటి సారి రూ. 20వేలు ఇచ్చారు.. రెండోసారి రూ.30,000 వేలు తీసుకుంటూ తమకు చిక్కారని.. శ్రీనివాస్ రాజ్, అశోక్‌ను అరెస్టు చేసి రేపు కోర్టులో హాజరుపర్చుతామని ఏసీబీ డీఎస్పీ సూర్యనారాయణ తెలిపారు.
https://www.youtube.com/watch?v=abuPUPNVZ4w
