BRS Vs Governor: గణతంత్ర వేడుకల్లో గవర్నర్ తమిళిసై చేసిన వ్యాఖ్యలను ఎమ్మెల్యేలు పల్లా రాజేశ్వర్ రెడ్డి, కడియం శ్రీహరిలు ఖండించారు, జనగామ జిల్లా టీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యేలు పల్లా రాజేశ్వర్ కడియం శ్రీహరిలు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. గవర్నర్ తను ఒక గవర్నర్ అని మర్చిపోయి గణతంత్ర వేదికను ఒక రాజకీయ వేదికలాగా మాట్లాడటం చాలా బాధాకరం అన్నారు. గవర్నర్ BJP ప్రతినిదిగా మాట్లాడినట్టు ఉందని, BRS పార్టీ తరుపున మేము ఖండిస్తున్నామన్నారు. రాజ్యాంగం పట్ల అవగాహన లేని వారిని గవర్నర్ చేస్తే ఏ విదంగా ఉంటుందో దీనికి నిదర్శనమే గవర్నర్ తమిళిసై అన్నారు. ఈ మాత్రం ఇంగిత జ్ఞానం లేని గవర్నర్ ను నియమించకూడదు అని కేంద్ర ప్రభుత్వంని కోరుతున్నా అన్నారు.
ఇలాంటి గవర్నర్ ఉండటం కన్నా మొత్తం గవర్నర్ వ్యవస్థను రద్దు చేయాలని మేము డిమాండ్ చేస్తున్నామన్నారు. గవర్నర్ వ్యవస్థలో ఉండి ఈ విదంగా ఉండటం సరైంది కాదు, ఆమే వ్యాఖ్యలు వెనుకకు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సుమారు 50 రోజులు అయ్యిందన్నారు. ఎన్నికల్లో 420 హామీలు ఇచ్చారు కానీ కేవలం 2 హామీలు మాత్రమే అమలు చేశారని తెలిపారు. ఆచరణకు లేని హామీలు ఇచ్చి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందన్నారు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి స్థాయిని మర్చిపోయి ఇంగిత జ్ఞానం లేకుండా మాట్లాడుతున్నాడని తెలిపారు. 100 మీటర్ల లోతులో BRS పార్టీ ని బొంద పెడుతా అంటే కార్యకర్తలు, నాయకులు రెచ్చిపోరా? అని ప్రశ్నించారు. కావాలని BRS పార్టీని రెచ్చగొడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Read also: YS Jagan: రాజ్యాంగ కర్తల బాటలో నడిచి దేశ అభ్యున్నతికి కృషి చేద్దాం: సీఎం జగన్
చార్లెస్-ఓబుల,బిళ్ళ-రంగ అని మా వారిని విమర్శిస్తూన్న రేవంత్ రెడ్డి పై ఎన్ని కేసులు,ఎలాంటి కేసులు ఉన్నాయో రాష్ట్ర ప్రజలకు తెలుసన్నారు. అధికారంలోకి రావడానికి ప్రజలను అనేక విధాలుగా మభ్యపెట్టి అధికారంలోకి వచ్చి, ఇచ్చిన హామీలను ఇవ్వకుండా BRS ప్రభుత్వం పై తోస్తున్నారని అన్నారు. MP ఎన్నికల కోడ్,షెడ్యూల్ పేరుతో తప్పించుకునే ప్రయత్నం చేస్తూ కాలయాపన చేస్తున్నారు. రెచ్చగొట్టే చర్యలకు కాకుండా కాంగ్రెస్ ప్రవేశపెట్టిన గ్యారెంటీ పథకాలను 100రోజుల్లో చేసి చూపియ్యండి అంటూ సవాల్ విసిరారు. BRS పార్టీని భయపెట్టే ప్రయత్నం చేస్తున్నారు,భయపడే పతిస్థితే లేదన్నారు. రానున్న లోక్ సభ ఎన్నికల్లో BRS సత్తా ఏంటో నిరూపిస్తామన్నారు.
గవర్నర్ బీజేపీ నాయకురాలిగా మాట్లాడటం శోచనీయమన్నారు ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ,BRS ప్రభుత్వం యొక్క అనేక బిల్లులను గవర్నర్ తొక్కి పట్టారని తెలిపారు. గవర్నర్ తన పదవి కి రాజీనామా చేసి, BJP నుండి పోటీ చేసి మాట్లాడాలన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గ్రామ కార్యకర్త కంటే అద్వాన్నంగా మాట్లాడారు ఇది సరైంది కాదన్నారు. కాళేశ్వరం మీద సరైన ఆయకట్టు గురించి తెలియని మంత్రులు నేడు రోజు బయపెట్టాలి అని మాట్లాడుతున్నారని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం పోలీసు వ్యవస్థ&ఇంటలిజెన్స్ వ్యవస్థతో హైదరాబాద్ లో తీన్మార్ మల్లన్నను చోట నాయీమ్ గా చేసి నా దగ్గరకు ,మా సంస్థలపైకి పంపి నన్ను బయపెట్టాలి అని చూస్తున్నారని తెలిపారు. పోలీసు-ఇంటలిజెన్స్ కలిసి ఒక చోట నయిమ్ ను తయారు చేస్తున్నారు ఇది సరయ్యింది కాదన్నారు. నామీద కక్షపురితంగా కేసులు పెట్టాలి అని పోలీసులు-ఇంటలిజెన్స్ వ్యవస్థ చూస్తుందని మండిపడ్డారు.
Professor Hargopal: మోడీ మరోసారి అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని మార్చేస్తాడు..