Site icon NTV Telugu

Telangana Bhavan: స్వాతంత్య్ర వజ్రోత్సవాల సందర్భంగా తెలంగాణ భవన్‌లో రక్తదానం

Telangana Bhavan

Telangana Bhavan

Telangana Bhavan: తెలంగాణ భవన్‌లో స్వాత్రంత్య వజ్రోత్సవాల సందర్భంగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీ కేశవరావు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. పలువురు టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు రక్తదానం చేశారు. స్వతంత్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా రక్తదాన శిబిరం నిర్వహిస్తున్నామని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత వెల్లడించారు. ఈ దేశంలో జరుగుతున్న పరిస్థితులను మన వంతు బాధ్యతగా భాగస్వామ్యం పంచుకోవాలని ఆమె సూచించారు.

Renuka Choudhary: మునుగోడు కాంగ్రెస్ అడ్డా.. గెలుపు మాదే..

భారతదేశాన్ని పట్టిపీడిస్తున్న ప్రధాన సమస్యల్లో పేదరికం ఒకటి అని ఆమె తెలిపారు. 75 ఏళ్ల స్వాతంత్రంలో పేదరికం అంతకంతకు పెరుగుతోందన్నారు. మతతత్వాన్ని సమూలంగా ఈ దేశం నుంచి రూపుమాపాలన్నారు.

Exit mobile version