Site icon NTV Telugu

BJP MLC Ramachandra Rao: ప్రజా జీవితంలో ఉన్నవారికి లుక్ ఔట్ నోటీసులా?

Bjp Mlc Ramachandra Rao

Bjp Mlc Ramachandra Rao

BJP MLC Ramachandra Rao: ప్రజా జీవితంలో ఉన్నవారికి లుక్ ఔట్ నోటీస్ లు ఇవ్వడం ఏంటని బీజేపీ మాజీ ఎమ్మెల్సీ నేత రామచందర్ రావు మండిపడ్డారు. లుక్ ఔట్ నోటీసులు ఇచ్చినట్లు తప్పుడు వార్తలు సోషల్ మీడియాలో టీఆర్ఎస్ నేత వై.సతీష్ రెడ్డి పెట్టారని అన్నారు. ఫేక్ నోటీసులు ఇచ్చారని ఎలా ప్రచారం చేస్తారు ? అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. క్షమాపణలు చెప్పకపోతే సీరియస్ యాక్షన్ తీసుకుంటామన్నారు. ఇన్విస్టిగేషన్ ఎలా సాగుతోంది.. లీకులు ఎలా ఇస్తున్నారు.. సిట్ అధికారులు దీన్ని ఖండించాలని ఆగ్రహం వ్యక్తం చేశారు. న్యూస్ ఎలా లీక్ అయ్యింది? మీడియాకు తప్పుడు వార్తలు ఇచ్చిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. న్యాయం కోసం కోర్ట్ కు వెళ్లడం మా హక్కు అన్నారు. వై.సతీష్ రెడ్డి, రావుల శ్రీధర్ రెడ్డిపై సిట్ చర్యలు తీసుకోవాలని అన్నారు.

read also: Fifa World Cup: జర్నలిస్ట్‌కి చేదు అనుభవం.. లైవ్‌లోనే దోచుకున్న దొంగ

బీజేపీ ఇమేజ్ ని డ్యామేజ్ చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నారన్నారు. ఈ కేసును సీబీఐకి అప్పగించాలని డిమాండ్ చేశారు. లుక్ ఔట్ నోటీసులు ఎవరికి ఇవ్వాలో కేంద్ర హోం మంత్రిత్వ శాఖ గైడ్ లైన్స్ ఉన్నాయన్నారు. ప్రజా జీవితంలో ఉన్న వారికి లుక్ ఔట్ నోటీస్ లు ఇవ్వడం ఏంటి? అని ప్రశ్నించారు. ఐటీ, ఈడీ అధికారులకు ఉన్న సమాచారం మేరకు సోదాలు నిర్వహిస్తున్నారని తెలిపారు. ఐటీ, ఈడీ సోదాల్లో పెద్ద ఎత్తున విలువైన పత్రాలు, వివరాలు దొరుకుతున్నాయన్నారు. ఇప్పటి వరకు నగదు దొరకపోయినా, నిబంధనలు ఉల్లంగిస్తున్నట్లు తెలుస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. జాతీయ దర్యాప్తు సంస్థలపై ఎలాంటి రాజకీయ ఒత్తిళ్లు లేవని స్పష్టం చేశారు. బీజీపీని రాజకీయంగా ఎదుర్కోలేకే ఎమ్మెల్యేల కొనుగోలు పేరుతో ఓ సినిమా చూపెట్టారని ఆరోపించారు. ఎలాంటి నిబంధనలు ఉల్లంఘించకపోతే టీఆర్ఎస్ నేతలకు భయమెందుకు? అంటూ ప్రశ్నించారు. టీఆర్ఎస్ నేతల్లో వణుకు మొదలైంది, రాబోయే రోజుల్లో టీఆర్ఎస్ పతనం తప్పదని సంచళన వ్యాఖ్యలు చేశారు.
Marri Shashidhar Reddy: వారు డబ్బులు తీసుకోవడం చూడలేదు …కానీ వ్యవహారం చూస్తే

Exit mobile version