NTV Telugu Site icon

Raja Singh: దమ్ముంటే అడ్డుకోండి.. పోలీసులకు రాజాసింగ్ సవాల్..

Raja Singh

Raja Singh

Raja Singh: నేనే రంగంలోకి దిగుతా దమ్ముటే అడ్డుకోవాలని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ సవాల్ విసిరారు. జూన్ 17న బక్రీద్ సందర్భంగా గోవుల తరలింపు అడ్డుకోవద్దని హిందువులను పోలీసులు బెదిరిస్తున్నారని మండిపడ్డారు. గోవధ చేయవద్దని, సుప్రీం కోర్టు ఇచ్చిన ఆదేశాలు పాటించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానికి లేదా ? అని ప్రశ్నించారు. హైదరాబాద్ కు యధేచ్చగా గోవులను తరలిస్తున్నారని మండిపడ్డారు. శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా గోవుల తరలింపు, హత్యలను అడ్డుకునే హిందూ కార్యకర్తలకు భద్రత కల్పించాలన్నారు. పోలీసులు పని హిందూ కార్యకర్తలు చేస్తుంటే… వాళ్ళను సపోర్ట్ చేయకుండా బెదిరింపులకు దిగడం ఏంటని ? ప్రశ్నించారు. హిందూ కార్యకర్తలపై రౌడీ షీట్ పెడతారా ? అని మండిపడ్డారు.

Read also: KTR: చార్మినార్ ను తొలగించడం అంటే హైదరాబాదీని అవమానించినట్లే..

గోవధ అడ్డుకోవడానికి నేనే నేరుగా రంగంలోకి దిగుతా అన్నారు. దమ్ముంటే అడ్డుకోవాలని రాజాసింగ్ సవాల్ చేశారు. గోవధను అడ్డుకుంటే బుల్లెట్ దించుతా అని ముస్లీంలు బెదిరిస్తున్నారన్నారు. ఎవరి బుల్లెట్ ఎవరికి దిగుతుంతో చూసుకుందాం రండి అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీస్ అధికారులకు విజ్ఞప్తి.. హిందు కార్యకర్తలకు ఫోన్ చేసి బెదిరించడం ఆపాలని మండిపడ్డారు. గో రక్షణ చేస్తే షూట్ చేస్తామని కొంతమంది చెప్తున్నారని తెలిపారు. వాళ్లకు నా ఛాలెంజ్… ఎవరిలో దమ్ము ఉందో చూసుకుందామన్నారు.
TS State Emblem: ఇదిగో కొత్త లోగో.. ఫొటో వైరల్..

Show comments