Site icon NTV Telugu

BJP Leader Satish Kumar Fraud: మెడికల్ సీట్ పేరుతో భారీ మోసం.. ఆపై అరెస్ట్

Bjp Leader Fraud

Bjp Leader Fraud

BJP Leader Satish Kumar Cheated In The Name Of Medical Seat: అతను ఒక రాజకీయ నాయకుడు.. పైగా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి చెందిన నేత. అలాంటప్పుడు ఎంత నిబద్ధతతో, విశ్వాసంతో ఉండాలి? ఎమ్మెల్యేగా సైతం పోటీ చేసిన ఆ నేత.. ప్రజా పరిపాలకుడిగా ఎంత బాధ్యతగా వ్యవహరించాలి? ప్రజలకు కష్టం వస్తే.. నేనున్నానంటూ అండగా నిలబడాలి. కష్టాల్లో ఉన్న వారికి ధైర్యం చెప్పి ముందుకు నడిపించడమే కాదు.. ఇతర నాయకులకు ఆదర్శంగా నిలవాలి. ప్రజల విశ్వాసం గెలిచేలా తమ నాయకత్వ పటిమ చాటాలి. కానీ.. ఓ బీజేపీ నేత మాత్రం అందుకు భిన్నంగా మోసానికి పాల్పడ్డాడు. మెడికల్ సీటు ఇప్పిస్తానని ఆశ చూపించి, ఒకరిని నిండా ముంచేశాడు.

ఆ బీజేపీ నేత పేరు కొత్తపల్లి సతీష్ కుమార్. ఈయన జనగాంలో బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ కూడా చేశాడు. కానీ, తన ప్రత్యర్థి అభ్యర్థి చేతిలో ఓడిపోయాడు. అంతేకాదు.. గతంలో బీఎస్పీ అభ్యర్థిగానూ పోటీ చేశాడు. ప్రస్తుతం బీజేపీలో ఉన్న సతీష్.. మెడికల్ సీటు ఇప్పిస్తానని చెప్పి, అక్షరాల రూ. 48 లక్షలు వసూలు చేశాడు. ఎంతసేపటికి సీటు ఇప్పించకపోవడం, అడిగినప్పుడల్లా తప్పించుకొని తిరుగుతుండడంతో.. తాము మోసపోయామని గ్రహించిన బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు.. నిందితునిపై ఐపీసీ 406, 420, 465, 468, 471 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అనంతరం నాంపల్లి హైకోర్టులో హాజరుపరిచారు.

Exit mobile version