హుజురాబాద్ ఉప ఎన్నికల తరువాత కేసీఆర్ మతితప్పి మాట్లాడుతున్నారు అని బీజేపీ నేత రవీంద్ర నాయక్ అన్నారు. కేసీఆర్ ను ఓటమిని తట్టుకోలేడు నాకు తెలుసు. కేసీఆర్ గొప్పలు నిజమైతే హుజురాబాద్ లో ఓటుకు 20వేలు ఎందుకు ఇచ్చారు. ప్రజల దృష్టి మరల్చేందుకే బీజేపీ పై తప్పుడు ప్రచారం చేస్తున్నారు. నీకు, నీ కొడుకుకు,బిడ్డకు ఫామ్ హౌస్ లు ఎక్కడ నుంచి వచ్చాయో మాకు తెలుసు. బండి సంజయ్ ని ఆరు ముక్కలు చేసే దమ్ముందా కేసీఆర్ అని అన్నారు. ఎస్సి, ఎస్టిల సబ్సిడీలు మొత్తం పక్కదారి పట్టించావు. నిన్ను టచ్ చేస్తే ఏమీ చేస్తావ్ కేసీఆర్. హుజురాబాద్ ఫలితం ఆరంభం మాత్రమే.. 2023లో బొంద పెడతారు. తెలంగాణ ఆర్ధిక వ్యవస్థను మొత్తం కేసీఆర్ దెబ్బ తీశారు. రైతు బంధు, దళిత బంధు పేరుతో కేసీఆర్ రాబంధు అయ్యారు. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో శ్రీకాంతచారి తల్లి శంకరమ్మకు అవకాశం ఇవ్వాలి అని పేర్కొన్నారు.
ప్రజల దృష్టి మరల్చేందుకే బీజేపీపై తప్పుడు ప్రచారం…
