NTV Telugu Site icon

అఖిలపక్షాన్ని బహిష్కరించిన బీజేపీ.. హాజరైన మోత్కుపల్లి..

Motkupalli Narasimhulu

Motkupalli Narasimhulu

సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన ప్రగతి భవన్‌లో జరుగుతోన్న అఖిలపక్ష సమావేశంలో ఆసక్తికరమైన పరిణామం చోటు చేసుకుంది.. సీఎం ద‌ళిత్ ఎంప‌వ‌ర్‌మెంట్ ప‌థ‌కానికి సంబంధించి ప్రగ‌తిభ‌వ‌న్‌లో అఖిల‌ప‌క్ష భేటీ ప్రారంభం కాగా.. ఈ స‌మావేశానికి అన్ని పార్టీల‌కు చెందిన ద‌ళిత ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ఎంఐఎం, కాంగ్రెస్‌, బీజేపీల‌కు చెందిన ఫ్లోర్ లీడ‌ర్లు, సీపీఐ, సీపీఐ నేతలకు, ఇక, ద‌ళిత నేత‌లు, ద‌ళిత వ‌ర్గాల అభ్యున్నతి కోసం పాటుప‌డుతున్న రాష్ట్రంలోని ఇత‌ర నాయ‌కుల‌కు ఆహ్వానాలు వెళ్లాయి.. ఈ భేటీకి కాంగ్రెస్ నుంచి సీఎల్పీ నేత భ‌ట్టి విక్ర‌మార్క‌, సీపీఎం నుంచి త‌మ్మినేని వీర‌భ‌ద్రం, సీపీఐ నుంచి చాడ వెంక‌ట్‌రెడ్డి, ఎంఐఎం నుంచి బ‌లాలా, పాషా ఖాద్రి, కొంత మంది దళితల నేతలు హాజరయ్యారు.. ఈ సమావేశాన్ని బహిష్కరిస్తున్నట్టు భారతీయ జనతా పార్టీ నిర్ణయం తీసుకోవడంతో.. ఆ పార్టీ ఫోర్ల్‌ లీడర్ రాజాసింగ్‌ హాజరుకాలేదు.. కానీ, ఆ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు ఈ సమావేశంలో పాల్గొనడం చర్చగా మారింది. సీనియర్‌ దళితల నేతలను కూడా అఖిలపక్ష భేటీకి ఆహ్వానించడంతో.. తనకు అందిన ఆహ్వానం మేరకు మోత్కుపల్లి.. వెళ్లినట్టుగా తెలుస్తోంది.