NTV Telugu Site icon

ఈసీకి బీజేపీ ఫిర్యాదు.. అంబులెన్స్‌ల ద్వారా డబ్బులు పంపిణీ..!

huzurabad

huzurabad

హుజురాబాద్‌లో ఉప ఎన్నికల పోలింగ్‌కు మరొక్కరోజు మాత్రమే సమయం ఉంది.. కానీ, పోటీ పోటీ ఫిర్యాదుల పర్వం మాత్రం ఆగడంలేదు.. టీఆర్ఎస్‌పై బీజేపీ… బీజేపీపై టీఆర్‌ఎస్‌… అధికార పక్షంపై మరో పార్టీ.. ఇలా రాష్ట్ర ఎన్నికల కమిషన్‌కు పరస్పరం ఫిర్యాదు చేసుకుంటూనే ఉన్నారు.. ఇక, ఎన్నికల ప్రచారం ముగిసి.. ప్రలోభాల పర్వం జోరుగా సాగుతుండడంపై కూడా ఈసీకి ఫిర్యాదులు అందుతున్నాయి.. తాజాగా, ఎన్నికల కమిషన్‌కు కంప్లైంట్‌ చేసిన బీజేపీ… హుజూరాబాద్ నియోజకవర్గంలో 144 సెక్షన్ పకడ్బందీగా అమలు చేయాలని కోరింది..

Read More: అక్టోబ‌ర్ 29, శుక్రవారం దిన‌ఫ‌లాలు

ఇక, అన్ని ప్రైవేటు ఆసుపత్రుల అంబులెన్స్ లను కేంద్ర బలగాలతో తనిఖీ చేయించాలని ఎన్నికల కమిషన్‌ను కోరింది భారతీయ జనతా పార్టీ… టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, మంత్రులు.. కిట్స్ కాలేజీ నుండి అంబులెన్స్ ల ద్వారా డబ్బులు పంపిస్తున్నారని ఈసీకి చేసిన ఫిర్యాదులో పేర్కొంది. మరోవైపు, 144 సెక్షన్ ఉన్న లోకల్ పోలీసుల అండతో టీఆర్ఎస్‌ నేతలు ఊర్లలో తిరుగుతున్నారిన.. అధికారులకు టీఆర్ఎస్‌ పార్టీ.. కరీంనగర్‌లో పార్టీ కూడా ఇచ్చినట్టు ఎన్నికల కమిషన్‌ దృష్టికి తీసుకెళ్లారు. కాగా, హుజురాబాద్‌లో డబ్బుల పంపిణీకి సంబంధించిన వీడియోలు సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తున్న సంగతి తెలిసిందే.. ఒకరు రూ.6 వేలు అంటే.. మరొకరు రూ.10.. ఇలా పోటీపోటీగా వీడియోలు లీక్‌ చేసుకుంటున్నారు.