NTV Telugu Site icon

Tarun Chugh: రేవంత్ రెడ్డి పార్టీని వీడే టైమ్ దగ్గరలోనే ఉంది

Tarunchug

Tarunchug

Tarun Chugh: రేవంత్ రెడ్డి పార్టీ నీ వీడే టైమ్ దగ్గరలోనే ఉందని బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి తరుణ్ చుగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీలో చేతులు కలుపుతారు… ఇక్కడ పోరాటం చేస్తారా.. మీ స్టాండ్ ఎంటి? అని రేవంత్ రెడ్డిని ప్రశ్నించారు. ఎవరి కోసం యాత్ర చేస్తున్నావు? అంటూ మండిపడ్డారు. కాంగ్రెస్ కి బీఆర్‌ఎస్‌ బీ టీమ్ అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఖర్గే కోసం ఢిల్లీలో ఆ పార్టీ పని చేస్తుందని అన్నారు. ఇక్కడ ఎవరికి వ్యతిరేకంగా యాత్ర చేస్తున్నావు రేవంత్? అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. ఆ రెండు పార్టీలు కలుస్తాయి! కలిస్తే పార్టీ నీ వీడుతానని అన్న రేవంత్ రెడ్డి పార్టీ నీ వీడే టైమ్ దగ్గరలోనే ఉందని తరుణ్ చుగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

Read also: Tpcc Protest event: ఈ నెల 21న జరగాల్సిన నిరుద్యోగ సభ రద్దు.. టీపీసీసీ ప్రకటన

ఇక సీఎం కేసీఆర్‌ పై విరుచుకుపడ్డారు. కేసీఆర్‌ సర్కార్ ను తెలంగాణ ప్రజలు మార్చాలని అనుకుంటున్నారని కీలక వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్‌ తెలంగాణ నయా నిజాం అంటూ నిప్పులు చెరిగారు. కేసీఆర్‌కు అహంకారం ఎక్కువ అని, రాజ్యాంగం, ప్రజాస్వామ్యం ఏమీ పట్టవని అన్నారు. కేసీఆర్‌ కుటుంబం వీటన్నిటికీ అతీతమని అనుకుంటాడని తరుణ్‌ చుగ్‌ అన్నారు. సీఎం రాజ్యాంగాన్ని అవమానిస్తారని, ఇది అత్యాచారాల ప్రభుత్వమని ఆయన ఆరోపించారు. టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీపై బీజేపీ ఆందోళన కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు. ఇది తెలంగాణ భవిష్యత్ కోసం పోరాటమని తరుణ్‌ చుగ్‌ అన్నారు. విపక్షాల కూటమి కోసం అయన ప్రయత్నాలు విఫలం అవుతున్నాయని, తన రిటైర్ మెంట్ కేసీఆర్‌కి తెలుసునని తరుణ్‌చుగ్‌ అన్నారు. నవంబర్‌లో అయన రిటైర్ కాబోతున్నారని, కేంద్రంలో బలహీన సర్కార్ రావాలని అనుకుంటున్నారని వ్యాఖ్యానించారు. టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ ఘటనపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపేవరకు పోరాటం చేస్తామని, నిరుద్యోగులకు లక్ష రూపాయల ఆర్థికసాయం చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ నాయకత్వంలో నిరుద్యోగుల పక్షాన ఆందోళలు కొనసాగిస్తామని తరుణ్ చుగ్ స్పష్టం చేశారు.