NTV Telugu Site icon

CM Revanth Reddy: సర్కారు ఆఫీసుల్లో బయోమెట్రిక్..? సెక్రటేరియట్ నుంచే శ్రీకారం..!

Cm Revanth Reddy

Cm Revanth Reddy

CM Revanth Reddy: త్వరలో రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో బయోమెట్రిక్ హాజరును అమలు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి భావిస్తున్నట్లు సమాచారం. ముందుగా సచివాలయం నుంచే దీక్షకు శ్రీకారం చుట్టినట్లు సమాచారం. సచివాలయంలోకి వెళ్లేటప్పుడు, బయటకు వెళ్లేటప్పుడు సీఎం, మంత్రులు, సీఎస్, కార్యదర్శుల నుంచి కింది స్థాయి అటెండర్ల నుంచి పంచ్ తీయడం తప్పనిసరి చేయాలనే ఆలోచనలో ఉన్నారని ప్రభుత్వ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.

ఉద్యోగుల్లో క్రమశిక్షణ, జవాబుదారీతనం పెంచేందుకు బయోమెట్రిక్ హాజరును తప్పనిసరి చేయాలని సీఎం యోచిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. ప్రభుత్వ ఉద్యోగులపై వచ్చిన విమర్శలను సీఎం సీరియస్‌గా తీసుకున్న సంగతి తెలిసిందే. దీంతో ముందుగా సచివాలయంలో బయోమెట్రిక్ హాజరు అమలు చేయాలని సీఎస్ శాంతికుమారికి సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలిసింది. ప్రతి ఒక్కరికీ బయోమెట్రిక్‌ హాజరు తప్పనిసరి చేయాలని యోచిస్తున్నామన్నారు.

Read also: Harom Hara : గ్రాండ్ గా హరోం హర ప్రీ రిలీజ్ ఈవెంట్.. గెస్టులు ఎవరో తెలుసా ..?

ఫలితంగా మంత్రులు, ఐఏఎస్‌లు, సచివాలయ ఉద్యోగులకు కూడా పంచ్‌లు వేయాల్సి ఉంటుందని సీఎం తన సన్నిహితులతో అన్నట్లు సమాచారం. సీఎం, సీఎస్‌, మంత్రులందరూ బయోమెట్రిక్‌ హాజరును పాటిస్తున్నందున కిందిస్థాయి ఉద్యోగుల విమర్శలకు ఆస్కారం ఉండదని సీఎం భావిస్తున్నట్లు సమాచారం. ప్రభుత్వ కార్యాలయాల్లో బయోమెట్రిక్ హాజరును తప్పనిసరి చేయాలని సీఎం కోరుతున్న సంగతి తెలిసిందే. కార్యాలయానికి వచ్చినప్పుడు, ఇంటికి వెళ్లేటప్పుడు కూడా పంచ్‌లు వేస్తే ప్రభుత్వ ఉద్యోగులపై ప్రజల్లో ఉన్న ప్రతికూల అభిప్రాయం తొలగిపోతుందని సీఎం అభిప్రాయపడినట్లు సమాచారం.

ఇందుకోసం త్వరలో రాష్ట్రవ్యాప్తంగా అన్ని కార్యాలయాల్లో బయోమెట్రిక్ హాజరును అమలు చేయాలని ఉన్నతాధికారులను ఆదేశించడం చర్చనీయాంశమవుతోంది. బయోమెట్రిక్ వల్ల ఉద్యోగులపై నిఘా, పనుల్లో వేగం పెంచడంతోపాటు ప్రజా సమస్యలను వెంటనే పరిష్కరించే అవకాశం ఉందని సీనియర్ ఐఏఎస్ అధికారి ఒకరు అభిప్రాయపడ్డారు. అయితే మొదట్లో ఉద్యోగుల నుంచి విమర్శలు వచ్చినా.. చివరికి ప్రజల నుంచి ప్రశంసలు వస్తాయని ఆయన అభిప్రాయపడ్డారు.
Telangana: రాష్ట్రవ్యా ప్తంగా స్కూల్ బస్సుల ఫిట్‌నెస్‌పై స్పెషల్ డ్రైవ్.. ఎప్పటి నుంచి అంటే..