NTV Telugu Site icon

Bhatti vikramarka: మహిళా సంఘాలకు భారీ మొత్తంలో వడ్డిలేని రుణాలు

Bhatti Vikramarka

Bhatti Vikramarka

Bhatti vikramarka: మహిళా సంఘాలకు వడ్డిలేని భారీ మొత్తంలో రుణాలు ఇస్తామని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు. యాదాద్రి జిల్లా పోచంపల్లి మండల కేంద్రంలో కార్నర్ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. 50 రోజుల్లో 620 కిలోమీటర్లు పూర్తి చేసామని తెలిపారు. 9 సంవత్సరాలలో దాదాపు 20 లక్షల కొట్లకు పైగా రూపాయల బడ్జెట్ ను ప్రవేశపెట్టుకున్నామన్నారు. కానీ ఏ ఒక్క తెలంగాణ వ్యక్తి ఆకాంక్ష నేరవేరలేదన్నారు. దళితులకు 3 ఎకరాల భూమిని పంచకపోగా.. కాంగ్రెస్ హాయాంలో ఇచ్చిన భూమిని ధరణి పేరుతో లాక్కుంటున్నారని ఆరోపించారు. ఆదిలాబాద్‌ అడవి బిడ్డల పరిస్థితి బీఆర్ఎస్‌ పాలనలో అత్యంత దయనీయంగా తయారైందన్నారు. కాపాడలని దీనంగా కాంగ్రెస్ ను వేడుకుంటున్నారని మండిపడ్డారు. సింగరేణిని ప్రైవేట్ వ్యక్తులకు దారాదత్తం చేస్తుంది కేసీఆర్ ప్రభుత్వం అంటూ నిప్పులు చెరిగారు. ఫలితంగా సింగరేణిలో ఉద్యోగ అవకాశాలు కొల్పోతున్నామని ఆగ్రహం వ్యక్తం చేశారు.

కాకతీయ యునీవర్సీటి విధ్యార్దులు నోటిఫికేషన్ల కోసం, ఉద్యోగాల కోసం ఎదరు చూస్తున్నారని తెలిపారు. వేసిన నొటిఫికేషన్లకు పరీక్షలు నిర్వహించడంలో బీఆర్ఎస్ ప్రభుత్వం విఫలమైందని మండిపడ్డారు. ఫీజీలు చేసినా ఉపాధి, ఉద్యోగ అవకాశాలు లేక యువత తీవ్రంగా ఇబ్బందులు పడుతుందని తెలిపారు. బస్వాపురం ప్రాజెక్టు నిర్మాణం విషయంలో.. ప్రభుత్వం భూనిర్వాసితులకు ఆర్ & ఆర్ ప్యాకేజీ ఇవ్వడంలో పూర్తిగా విఫలమైందని పేర్కొన్నారు. భువనగిరి నియోజకవర్గంలో యువత కొదమసింహంలా కదిలి వస్తుంటే భువనగిరి కోటపై కాంగ్రెస్ జెండా, గొల్కోండ కొటపైనా కాంగ్రెస్ పార్టీ జాతీయ జెండా ఎగరవేయడం ఖాయమనిపిస్తుందని తెలిపారు. చేనేత కార్మిలకుల మగ్గాలకు ఉచిత కరెంట్ ఇస్తానని హామి ఇచ్చాను, వారిని కాపాడుకోవడం నా భాద్యత ఉందని, చేనేత కార్మికులకు, కాంగ్రెస్ పార్టీకీ అవినాభావ సంబందం ఉందని పేర్కొన్నారు. GSTతో చేనేత రంగం కుదేలవుతుందని తెలిపారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే కేంద్రం చేనేతపై విధిస్తున్న GST కాంగ్రెస్ ప్రభుత్వమే భరిస్తుందని అన్నారు. చారిత్రక నేపధ్యం ఉన్న భూదాన్ పోచంపల్లిలో తనకు మాట్లాడే అవకాశం రావడం గర్వంగా ఉందని హర్షం వ్యక్తం చేశారు.

ధనిక రాష్ట్రం సంపద రాష్ట్ర ప్రజలే అనుభవించాలని కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిందని గుర్తు చేశారు. వచ్చేది ఇందిరమ్మ రాజ్యమే అని తెలిపారు. ప్రతీ పేద కుటుంబానికి ఇంటి స్థలం ఇస్తామన్నారు. ఇచ్చిన ఇంటి స్దలంలో ఇంటి నిర్మాణానికి 5లక్షలు ఇస్తామన్నారు. రేషన్ దుకాణాల్లో బియ్యం మాత్రమే ఇస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇందిరమ్మ రాజ్యం వస్తే 9 రకాల నిత్యావసర సరుకులు అందజేస్తామన్నారు. 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ అందజేస్తామన్నారు. మహిళా సంఘాలకు వడ్డిలేని భారీ మొత్తంలో రుణాలు ఇస్తామని తెలిపారు. 2 లక్షల రుణమాఫీ ఒకేసారి చేస్తామని తెలిపారు. కూళీ బందు పేరుతో ప్రతీ ఒక్క కూళీ అకౌంట్ లో 12 వేల రూపాయలు వేస్తామని హామీ ఇచ్చారు. ఉద్యోగ నియామక క్యాలెండర్ విడుదల చేస్తామని, రెగ్యూలర్ గా నియామకాలు చేస్తామని తెలిపారు. ఉద్యోగాలు వచ్చే వరకు నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు. ఉచిత నిర్భంద ఇంగ్లీష్‌ మీడియంలో విద్యను అందజేస్తామన్నారు. 5 లక్షల వరకు రాజీవ్ ఆరోగ్యశ్రీని పెంచుతామన్నారు. ప్రజలకు ప్రాణాంతకంగా మారిన కాలుష్య కారక పరిశ్రమలకు నోటీసులు ఇచ్చి వాటిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. మూసీ ప్రక్షాళన చేస్తామన్నారు. మన బడ్జట్ మనమే ఖర్చుపెట్టుకునే ప్రభుత్వాన్ని తెచ్చుకుందామని తెలిపారు. పాదయాత్ర ఎలాంటి ఇబ్బందులు లేకుండా పూర్తి కావాలని ప్రతీ ఒక్కరూ ఆశీర్వదించాలని భట్టి ప్రజలను కోరారు.
Astrology : మే 06, శనివారం దినఫలాలు

Show comments