NTV Telugu Site icon

Bandi Sanjay: తెలంగాణ ప్రజల కొంప ముంచింది మొత్తం చేపల పులుసే..

Bandi Sanjay

Bandi Sanjay

Bandi Sanjay: తెలంగాణ ప్రజల కొంప ముంచింది మొత్తం చేపల పులుసే అంటూ బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీ రైతు సదస్సులో భాగంగా బండి సంజయ్ మాట్లాడుతూ.. ట్రిబ్యునల్ అంటే వెదిరే శ్రీరామ్ గుర్తుకు వస్తారని అన్నారు. రెండు రాష్ట్రాలు బాగుండాలని కోరుకునే వ్యక్తి అని తెలిపారు. తెలంగాణ ప్రజల కొంప ముంచింది మొత్తం చేపల పులుసే అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన చేస్తే సంసారం.. ఇతరులు చేస్తే వ్యభిచారం ఇది.. కేసీఆర్ తీరు అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఉద్యమ సమయంలోనే ప్రజలను మోసం చేశారన్నారు. దక్షిణ తెలంగాణ ప్రజలను మొత్తం ముంచారని తెలిపారు. విభజన సమయంలోనే కేసీఆర్.. పైసలు, కమీషన్లకు లాలూచీ పడి కేవలం 570 టీఎంసీలకు బదులు 292 టీఎంసీలకు సంతకం పెట్టాడని అన్నారు. ఆపై 9 ఏండ్లు కేంద్రానికి ట్రిబ్యునల్ ఏర్పాటు చేయాలని లేఖ రాశారు. కానీ కేంద్రం నుంచి వచ్చిన రిప్లై గురించి మాత్రం ఎవరికీ చెప్పలేదన్నారు. ఈయన ఇలా చేస్తున్నాడని అపెక్స్ కౌన్సిల్ ఏర్పాటు చేస్తే గైర్హాజరయ్యారని తెలిపారు.

కేసీఆర్ 299 టీఎంసీలకు సంతకం పెట్టిన దాన్ని సాక్షాలతో సహా బయటపెట్టామన్నారు.
అప్పటి మంత్రి గజేంద్ర సింగ్ షేకావత్ కోర్టు కేసులో ఉండటం వల్ల ట్రిబ్యునల్ ఏర్పాటు చేయలేకపోతున్నామని చెప్పారని అన్నారు. అలా చెప్పాక కూడా కేసీఆర్ ఏడాది సమయం వృథా చేశారన్నారు. మొత్తానికి కేంద్రం ట్రిబ్యునల్ ఏర్పాటు చేస్తే కనీసం సంతోషం వ్యక్తం చేయలేదన్నారు. రైతులు నష్టపోవడమే ఆయనకు కావాలన్నారు. కేసీఆర్ నోటి నుంచి ముత్యాలు కాదు.. మందు రాలుతుందన్నారు. ఒక్క మోటార్ తో లక్ష ఎకరాలకు నీళ్లు ఎలా సాధ్యమన్నారు. తెలంగాణలో పండిన ప్రతి గింజను కేంద్రం కొనడానికి సిద్ధంగా ఉందని తెలిపారు. కేంద్రం 2030 కి కొనడానికి సిద్ధంగా ఉన్నప్పుడు.. కేసీఆర్ 1700కి ఎలా రేటు ఫిక్స్ చేసావన్నారు. ఎవరికి లాభం చేయడానికి ఈ రేటు ఫిక్స్ చేసారు? అని ప్రశ్నించారు. దీని ద్వారా 500 నుంచి 700 కోట్లు చేతులు మారాయని ఆరోపించారు. ఇవన్నీ.. ప్రగతి భవన్ కు చేరాయని సంచలన వ్యాఖ్యలు చేశారు. రిటయిర్డ్ అధికారులను తీసుకొచ్చి సిఎంఓ కార్యాలయంలో పెట్టి ప్రజలను ఎలా దోచుకోవాలని వారిని నియమించుకున్నారని మండిపడ్డారు. అన్ని ముఖ్య శాఖల్లో ఇదే పరిస్థితి అన్నారు. కేసీఆర్ బండారం మొత్తం బయటపెడుతామన్నారు. తట్రిబ్యునల్ ఏర్పాటు చేస్తే గతంలో నేను రాసిన లేఖలు, బండారం బయటపడుతాయని కేసీఆర్ భయపడుతున్నారని అన్నారు.

ఎండాకాలం రాకముందే సాగర్ లో ఒక్క చుక్క నీరు లేదన్నారు. రేపు ఎల్లుండి.. కేసీఆర్ బయటకు వస్తారని అన్నారు. రైతు బంధు, ఫ్రీ యూరియా అంటూ అన్ని అబద్ధాలు చెప్తారని అన్నారు. వచ్చే ఎన్నికల్లో కేసీఆర్ గెలిస్తే.. రైతు బంధు కూడా రాదు.. దాన్ని కేసీఆర్ ఆపేయడం ఖాయం మన్నారు. దుబ్బాక, హుజురాబాద్ ఎన్నికల్లో మోటార్లకు మీటర్లు పెడతారని అంటే.. అబద్ధాలు చెప్తే నీకే మీటర్ పెడతామని హెచ్చరించామని తెలిపారు. నంబర్ వన్ దొంగ, బట్టేబాజ్ కేసీఆర్ అంటూ బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. మోటార్లకు మీటర్లు అని అంటే ప్రగతి భవన్ కు వచ్చి గల్లా పట్టి కొడతాం అంటే.. నోరు ముస్కున్నాడని అన్నారు. రైతులు తలుచుకుంటే.. బీఆరెస్ ను గద్దె దింపవచ్చన్నారు. ధాన్యం కొనుగోలులో గోనె సంచి నుంచి కేసీఆర్ సర్కార్ చేసే బ్రోకర్ పర్శంటేజి కూడా కేంద్రం ఇస్తోందన్నారు. ఓటు వేసేందుకు వెళ్లే ముందు ప్రజలకు కేసీఆర్ తిన్న చేపల పులుసు గుర్తుకు రావాలి.. పట పట పండ్లు కొరికి కమలం పువ్వు గుర్తుకు ఓటేయాలన్నారు.
Telangana TDP: రాజమండ్రికి టి.టీడీపీ నేతలు.. ఫైనల్‌ కానున్న అభ్యర్థుల లిస్ట్..!