NTV Telugu Site icon

Bandi Sanjay: జైలుకు పోయిన చరిత్ర నాది.. బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

Bandi Sanjay Kareemnagar

Bandi Sanjay Kareemnagar

Bandi Sanjay: ప్రజల సమస్యలపై పోరాడి జైలుకు పోయిన చరిత్ర నాదని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ అన్నారు. కరీంనగర్ లోని కమాన్ పూర్ గ్రామంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. భూకబ్జాలు తప్ప మీకేం తెలుసు? అని ప్రశ్నించారు. ప్రజల కోసం ఎన్నడైనా పోరాడి జైలుకుపోయారా? అని మండిపడ్డారు. కరీంనగర్ పై పూర్తి అవగాహనే లేని వ్యక్తి కాంగ్రెస్ అభ్యర్ధి అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. లక్ష ఫోన్లు, ఓటుకు రూ.10 వేలును నమ్ముకున్న గంగుల కమలాకర్ అని మండిపడ్డారు. మీ సమస్యలపై పోరాడి జైలుకు పోయిన చరిత్ర నాదని అన్నారు. మీరు ఓట్లు వేయకుంటే పేదల పక్షాన పోరాడేవాళ్లు వెనుకంజవేస్తారని అన్నారు. గంగుల లక్ష సెల్ ఫోన్ల, ఓటుకు రూ.10 వేలను నమ్ముకున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓటుతో బీఆర్ఎస్, కాంగ్రెస్ అభ్యర్థులకు బుద్ది చెప్పాలని పిలుపు నిచ్చారు. కరీంనగర్ వచ్చి అభివృద్ధి గురించి కేసీఆర్ ఎందుకు మాట్లాడలేదు? అని ప్రశ్నించారు.

నిర్మల్ జిల్లా ముధోల్ ప్లానింగ్ ఏరియాలోని భైంసా పట్టణంలో ఇవాళ నిర్వహించనున్న బీజేపీ బహిరంగ సభకు బండి సంజయ్ హాజరుకానున్నారు. భైంసాలో జరిగే బహిరంగ సభలో బండి సంజయ్ పాల్గొని ప్రసంగిస్తారు. బీజేపీ అభ్యర్థి రామారావు పటేల్ తరపున ఎన్నికల ప్రచార సభలో పాల్గొంటారు. గతేడాది తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా బండి సంజయ్ భైంసా నుంచి ప్రజా పోరాట యాత్ర కొనసాగించారు.. సరిగ్గా ఏడాది తర్వాత మళ్లీ బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి హోదాలో భైంసా భారీ బహిరంగ సభకు హాజరుకానున్నారు. ఈ సందర్భంగా అసెంబ్లీ ఆవరణలోని కోర్టుపై బీజేపీ నేతలు దాడి చేశారు. ముధోల్ నియోజకవర్గంలో భాజపా విజయమే ధ్యేయంగా ఈ సభ నిర్వహిస్తున్నట్లు నియోజకవర్గ అభ్యర్థి రామారావు పటేల్ తెలిపారు.
IND vs AUS Final Weather Report: అహ్మదాబాద్‌లో వాతావరణ పరిస్థితి ఏంటంటే..?