NTV Telugu Site icon

Balkampeta Ellamma Kalyanam: నేడే బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణం.. పట్టువస్త్రాలు సమర్పించనున్న మంత్రులు

Balkampeta Kalyanam

Balkampeta Kalyanam

Balkampeta Ellamma Kalyanam: బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణోత్సవాలను వైభవంగా నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు పూర్తిచేశారు. ఈరోజు ఉదయం 9.30 గంటల నుంచి జరగనున్న ఎల్లమ్మ అమ్మవారి కళ్యాణాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ప్రభుత్వం ఏర్పాటు పూర్తి చేసింది. కళ్యాణాన్ని టీవీల్లో వీక్షించేలా లైవ్​ఇస్తున్నట్లు వివరించారు. అలాగే ఆలయానికి చేరుకునేలా ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఏటా ఆషాడమాసం మొదటి మంగళవారం ఎల్లమ్మ తల్లి కళ్యాణం అత్యంత వైభవంగా నిర్వహించనున్నారు. కళ్యాణానికి ప్రభుత్వం తరఫున మంత్రులు పట్టువస్త్రాలు సమర్పించనున్నారు. అమ్మవారి కళ్యాణాన్ని తిలకించేందుకు లక్షలాది మంది భక్తులు తరలివచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు పడకుండా అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. నిన్న ఎదుర్కోళ్లు ఘనంగా నిర్వహించగా.. ఇవాల ఎల్లమ్మ కళ్యాణం, రేపు సాయంత్రం రథోత్సవం జరగనుంది.

Read also: Venu Yeldandi : తన రెండవ సినిమా పనులు మొదలు పెట్టిన దర్శకుడు వేణు..

సుమారు 15 లక్షల మంది భక్తులు హాజరవుతారనే అంచనా నేపథ్యంలో బల్కంటపే పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. గ్రీన్‌ ల్యాండ్‌, అమీర్‌ పేట సత్యం థియేటర్ నుంచి ఫతేనగర్ వైపు వెళ్లే వాహనాలు ఎల్లమ్మ దేవాలయం మీదుగా కాకుండా ఇతర రూట్లలో వెళ్లాల్సి ఉంటుంది. బల్కంపేట్ ఎల్లమ్మ కల్యాణం సందర్భంగా మంగళవారం ఆలయ పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్లు నగర ట్రాఫిక్ అదనపు సీపీ సుధీర్ బాబు తెలిపారు. గ్రీన్ ల్యాండ్, మాతా ఆలయం, సత్యం థియేటర్ వైపు నుంచి ఫతేనగర్ వెళ్లే వాహనాలను SR నగర్ టీ జంక్షన్ నుంచి SRనగర్ కమ్యూనిటీ హాల్, అభిలాష్ టవర్స్, బీకే గూడ ఎక్స్ రోడ్డు, శ్రీరాంనగర్ క్రాస్ రోడ్డు, ఫతేనగర్ రోడ్డులోకి మళ్లిస్తారని పేర్కొన్నారు. గ్రీన్‌ల్యాండ్స్, మాతా టెంపుల్, సత్యం థియేటర్, ఫతేనగర్ వైపు వెళ్లే వాహనాలను ఎస్సార్‌నగర్ టీ జంక్షన్ వద్ద ఎస్సార్ నగర్ కమ్యూనిటీ హాల్, అభిలాషా టవర్స్, బీకే గూడ ఎక్స్ రోడ్, శ్రీరామ నగర్ క్రాస్ రోడ్, సనత్ నగర్ వైపు మళ్లించనున్నట్లు ట్రాఫిక్ పోలీసులు తెలిపారు.

Read also: Mangoes stolen: ఆన్‌లైన్‌లో పోస్ట్ చేశాడు..కట్ చేస్తే కిలో రూ.2.5 లక్షల విలువైన మామిడి పండ్లు చోరీ

ఇక ఫతే‌నగర్ ఫ్లైఓవర్ నుంచి బల్కంపేట వైపు వచ్చే ట్రాఫిక్‌ను కట్ట మైసమ్మ దేవాలయం, బేగంపేట వైపు మళ్లించనున్నారు. ఇక గ్రీన్‌ల్యాండ్స్, బకుల్ అపార్ట్‌మెంట్స్, ఫుడ్ వరల్డ్ నుంచి బల్కంపేట్ వైపు వెళ్లే వాహనదారులను ఫుడ్ వరల్డ్ క్రాస్ రోడ్ వద్ద సోనాబాయి టెంపుల్, సత్యం థియేటర్, మైత్రీవనం, ఎస్సార్ నగర్ టీ జంక్షన్ వైపు మళ్లించనున్నట్లు చెప్పారు పోలీసులు. అలాగే బేగంపేట, కట్ట మైసమ్మ దేవాలయం వైపు నుంచి బల్కంపేట్ వైపు వెళ్లే ట్రాఫిక్‌ను గ్రీన్‌ల్యాండ్స్, మాతా దేవాలయం, సత్యం థియేటర్, ఎస్సార్ నగర్ ట జంక్షన్, ఎస్సార్ నగర్ కమ్యూనిటీ హాల్ వైపు మళ్లింపు చేపట్టనున్నారు. ఇక ఎస్సార్‌నగర్ టీ జంక్షన్ నుంచి ఫతే‌నగర్, బల్కంపేట్ వైపు వచ్చే ట్రాఫిక్‌ కోసం బై-లేన్లు, లింక్ రోడ్లు మూసివేయనున్నట్లు ట్రాఫిక్ పోలీసులు స్పష్టం చేశారు. ప్రజలు ట్రాఫిక్ ఆంక్షలను పాటించి తమకు సహకరించాలని కోరారు.
Venu Yeldandi : తన రెండవ సినిమా పనులు మొదలు పెట్టిన దర్శకుడు వేణు..

Show comments