NTV Telugu Site icon

Balka Suman: చెన్నూరులో వివేక్ డబ్బులు పంచుతున్నారు.. బాల్కసుమన్ సంచలన వ్యాఖ్యలు

Balkasuman

Balkasuman

Balka Suman: చెన్నూరూ నియోజకవర్గంలో మాజీ ఎంపీ, కాంగ్రెస్ నేత వివేక్ వెంకట స్వామి డబ్బులు పంచుతున్నారని ఎమ్మెల్యే బాల్క సుమన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అనంతరం మంచిర్యాల జిల్లాలో ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్ ని కలిసి వివేక్ పై ఫిర్యాదు చేశారు. చెన్నూరూ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి వివేక్ విచ్చవిడిగా డబ్బులు పంచుతున్నారని అన్నారు. వివేక్ పక్కన ఉన్న వారి అకౌంట్స్ లోకి డబ్బులు జమ చేస్తున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్ఫోర్స్ మెంట్,ఇన్కమ్ టాక్స్ వాళ్లకు పిర్యాదు చేస్తామన్నారు. అకౌంట్స్ ని ఫ్రీజ్ చేయాలని సీఈఓని కోరామన్నారు. వివేక్ కుటుంబ సభ్యుల అకౌంట్స్ పై నిఘా పెట్టాలని సీఈఓని కోరామన్నారు. పెట్రోల్, బిల్డర్స్, రైస్ మిల్స్, సిమెంట్, స్టిల్ కంపెనీల వాళ్లకు డబ్బులు హైదరాబాద్ నుంచి పంపుతున్నారని కీలక వ్యాఖ్యలు చేశారు. వివేక్ కుటుంబం చేస్తున్న పాపంలో పాలు పంచుకోవద్దని వ్యాపారులను కోరుతున్నామన్నారు.

బీజేపీలో వివేక్ మ్యానిఫెస్టో కమిటీ చైర్మన్ గా ఉన్నారని అన్నారు. వివేక్ నమ్మక ద్రోహి.. వాళ్ళ బీజేపీ జాతీయ పార్టీ మ్యానిఫెస్టో విడుదల చేయలేదన్నారు. కక్ష్యతో బాల్క సుమన్ ని ఓడగొట్టారని చూస్తున్నారని అన్నారు. వేల కోట్లు బాల్క సుమన్ సంపదిస్తే వివేక్ లా వ్యాపారులు చేసే వాడని వ్యంగాస్త్రం వేశారు. వివేక్ వ్యాపారుల్లో ఛానెల్ లో ఉద్యోగాలు చేసే వాళ్ళు నియోజకవర్గం లో ప్రచారం చేస్తున్నారని అన్నారు. వివేక్ తన తండ్రిని పట్టించుకోలేదన్నారు. వాళ్ళ తండ్రి కూడా నియోజకవర్గనికి ఏమి చేయలేదన్నారు. డబ్బులతో వివేక్ రాజకీయాలు చేస్తూన్నారని మండిపడ్డారు. ధన రాజకీయాలు, డబ్బు రాజకీయాలు చేసే వాళ్లు సమాజానికి మంచిది కాదని హెచ్చరించారు.
Minister KTR: కాంగ్రెస్, బీజేపీ వాళ్లకు టికెట్లు ఢిల్లీలో ఇస్తారు ఇక్కడ కాదు..

Show comments