Aswaraopeta Farmers’ warning to forest officials: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట మండలం గాండ్ల గూడెం గ్రామంలో పొడు వ్యవసాయం చేసుకుంటున్న రైతులు జీవనం సాగిస్తున్నారు. ఇవాళ తమ పొలాలకు వెళుతున్న రైతులను ఫారెస్టు అధికారులు అడ్డుకున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. రైతులను తమ పొలాల్లోకి ఎరువులు పురుగు మందులు స్ప్రే చేసుకోరాడానికి వెళుతున్నటువంటి వారిని ఫారెస్టు అధికారులు అడ్డుకున్నారని ఆరోపించారు. ఎప్పటినుంచో తమ పోలాల్లో వ్యవసాయం చేసుకుంటున్నామని, అటవీశాఖ అధికారులు కావాలనే కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని గాండ్ల గూడెం పోడు వ్యవసాయం చేసుకుంటున్న రైతులు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో గాండ్లగూడెం గ్రామస్తులకు అటవీశాఖ అధికారులకు భారీ స్థాయిలో వాగ్వాదం జరిగింది. ఈ నియోజకవర్గంలో ఎక్కడో చోట ప్రతిరోజు అటవీ శాఖ అధికారులకు ఆదివాసి గిరిజనులకు పోడు భూముల విషయంలో నిత్యం ఘర్షణ వాతావరణం నెలకొనే విధంగా పరిస్థితులు ఏర్పడ్డాయి.
పొడు వివాదంలో ఓ క్లారిటీ లేకుండా అటవీశాఖ అధికారులు వ్యవహరిస్తున్నారని కొంతమంది గిరిజన నాయకులు ఆరోపిస్తున్నారు, 2004కి ముందు పొడు కొట్టుకుని వ్యవసాయం చేసుకుంటున్నప్పటికీ ఈరోజు వరకు ప్రభుత్వం పట్టా పుస్తకాలు ఇవ్వకుండా ఉండటంతో 2004 ముందు పోడగొట్టుకున్నది ఎవరు, తర్వాత కొట్టింది ఎవరు అనే క్లారిటీ అటవీశాఖ అధికారులకు లేక ఒకవేళ ఉన్న వాళ్లకు క్లారిటీ ఇచ్చేటటువంటి వ్యవస్థ లేకపోవడంతో ఇష్టానుసారం వ్యవహరిస్తున్నారు. గిరిజనులపై ఈ దాడులు ఆపకపోతే ఉద్యమం భారీ స్థాయిలో చేయాల్సి వస్తుందని అటవీశాఖ అధికారులకు ఉన్నత అధికారులకు గిరిజనులు హెచ్చరిక చేస్తున్నారు. గిరిజన నాయకులు ఇది ఇలాగే కొనసాగితే అటవీ శాఖ అధికారులకు దగ్గరగా ఉండే వారి పోడు వ్యవసాయాల్లోకి అడుగుపెట్టట్లేదని కొంతమందిని కావాలనే వాళ్ళ పొలాల్లోకి వెళ్లి టార్గెట్ చేస్తున్నారని ఆరోపిస్తున్నారు.
BB6: గీతూ ‘నోటిదూల’పై సుదీర్ఘ చర్చ!