Site icon NTV Telugu

Bathukamma Festival: 25 నుంచి అక్టోబర్‌ 3వ తేదీ వరకు బతుకమ్మ సంబురాలు..

Bathukamma Festival

Bathukamma Festival

Bathukamma Festival: తెలంగాణ‌లో ఈరోజు నుంచి బ‌తుక‌మ్మ పండ‌గ సంబ‌రాలు ప్రారంభం కాబోతున్నాయి. ప్ర‌తి ఏడాది బ‌తుక‌మ్మ పండ‌గ సంబ‌రాలు అంగ‌రంగ వైభ‌వంగా నిర్వ‌హిస్తుంటారు. ఈసారి వేడుక‌ల‌ను ఘ‌నంగా నిర్వ‌హించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. 9 రోజుల‌పాటు ఈ వేడుక‌లు జ‌ర‌గ‌బోతున్నాయి. తొలిరోజు ఎంగిలిపూల‌తో బ‌తుక‌మ్మ పండుగ మొద‌ల‌య్యి చివ‌రిరోజు స‌ద్దుల బ‌తుక‌మ్మ‌తో వేడుక‌లు ప‌రిస‌మాప్త‌మ‌వుతాయి.

ఈనేపథ్యంలో.. లంగాణ రాష్ట్ర సంస్కృతి, సాంప్రదాయాలకు అద్దం పట్టే బతుకమ్మ ఉత్సవాల నిర్వహణకు విస్తృత ఏర్పటు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ అధికారులను ఆదేశించారు. ఈనేపథ్యంలో బతుకమ్మ పండగ ఏర్పాట్లపై బీఆర్కే భవన్‌లో ప్రభుత్వసలహాదారు రమణాచారి, సీఎస్, డీజీపీ, వివిధ శాఖల అధికారులతో ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈనెల 25 నుంచి అక్టోబర్‌ 3వ తేదీ వరకు బతుకమ్మ పండగ ఉంటుందని.. సద్దుల బతుకమ్మ జరిగే అక్టోబర్‌ 3న ట్యాంక్‌ బండ్‌ వద్ద విస్తృత ఏర్పాట్లు చేయాలని సీఎస్‌ అధికారులను ఆదేశించారు. అయితే.. బతుకమ్మ ఘాట్, ట్యాంక్ బండ్, పరిసర ప్రాంతాల్లో పారిశుద్ధ్య నిర్వహణ, రోడ్ల మరమ్మతులు వెంటనే చేపట్టాలని, మహిళలు ఉత్సవాల్లో భారీ సంఖ్యలో పాల్గొనే అవకాశం ఉన్నందున పకడ్బందీ ఏర్పాట్లు చేయాలన్నారు సీఎస్‌. అంతేకాకుంఆ.. ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాలన్నింటినీ విద్యుత్ దీపాలతో అలంకరించాలని.. బతుకమ్మలను నిమజ్జనం చేసే ప్రాంతాల్లో ఏ విధమైన ప్రమాదాలు జరగకుండా గజ ఈతగాళ్లను సిద్ధంగా ఉంచాలని సూచించారు. ఇక బతుకమ్మ పండగపై ఆకర్షణీయమైన డిజైన్‌లతో మెట్రో పిల్లర్లను అలంకరించాలని.. ఎల్బీ స్టేడియం, నగరంలోని ప్రధాన కూడళ్లలో బతుకమ్మ లోగోలను ఏర్పాటు చేయాలని.. నిర్వహణ ఏర్పాట్లు కూడా ఘనంగా ఉండాలని ఆదేశించారు.
Tues Day Hanuman Chalis Parayanam Live: ఈ రోజు హనుమాన్ చాలీసా వింటే ఎలాంటి కష్టాలు రావు..

Exit mobile version