TS Govt: తెలంగాణ ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన మైనార్టీలకు రూ.లక్ష ఆర్థిక సాయం పథకం అమలుకు చర్యలు తీసుకుంటున్నారు. ఈ పథకానికి సంబంధించిన అధికారిక నోటిఫికేషన్ ను ప్రభుత్వం 23న విడుదల చేసింది. అందులో విధివిధానాలు, అర్హతలు వివరించారు. అయితే ఇందులో ముస్లింలు, క్రైస్తవులకు ఆయా వర్గాల కొర్పొరేషన్ నిధుల నుంచి ప్రభుత్వం ఆర్థిక సాయం అందజేస్తుంది. ఈక్రమంలో కమ్యూనిటీ కార్పొరేషన్ క్రైస్తవుల నుంచి దరఖాస్తులను ఆహ్వానించింది. ఈ నెల 31 నుంచి ఆగస్టు 14వ తేదీ వరకు www.tsobmms.gov.in పోర్టల్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని అధికారులు వెల్లడించారు. అయితే ఈ పథకానికి 21 నుంచి 55 ఏళ్ల లోపు వారు మాత్రమే అర్హులని ప్రభుత్వం పేర్కొంది.
Read also: Telangana Rians: రాబోయే వారం రోజులు వానల్లేవు.. ఆగస్టు రెండో వారం నుంచి మళ్లీ స్టార్ట్
అలాగే గ్రామీణ ప్రాంతాల్లోని వారి ఆదాయం లక్షన్నర లోపు, పట్టణ ప్రాంతాల్లోని వారి ఆదాయం రెండు లక్షల లోపు ఉండాలనే నిబంధన కూడా వర్తింపజేయనున్నారు. ఇతర వివరాలకు క్రిస్టియన్ కార్పొరేషన్ కార్యాలయంలోని జిల్లా మైనార్టీ అధికారిని లేదా 040-23391067 నంబర్ కు ఫోన్ చేయవచ్చని అధికారులు తెలిపారు. తెలంగాణలోని అన్ని వర్గాలు ఆర్థికంగా బలపడాలనే లక్ష్యంతో కేసీఆర్ సర్కార్ కొత్త పథకాలను తీసుకువస్తోంది. ఇప్పటికే దళిత బంధు పథకం తీసుకొచ్చి.. నెల రోజుల్లోనే చేతివృత్తులు, కులవృత్తుల కార్మికులకు లక్ష రూపాయల ఆర్థిక సాయం పథకం అమలు చేస్తున్నామన్నారు. ఇక ఇప్పుడు మైనార్టీలకు ఆర్థికంగా చేయూతనిచ్చేందుకు… బీసీ బంధు మాదిరిగానే… తాజాగా 100% సబ్సిడీతో లక్ష రూపాయలు ఇచ్చేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కేసీఆర్ తీసుకున్న ఈ నిర్ణయంతో రాష్ట్ర వ్యాప్తంగా మైనార్టీలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Semicon India: సెమీకండక్టర్ పరిశ్రమలకు 50 శాతం ఆర్థిక సాయం: ప్రధాని మోడీ