Site icon NTV Telugu

Hyderabad: చిక్కడపల్లి బాయ్స్ హాస్టల్లో ఏపీ విద్యార్థి ఆత్మహత్య.. కారణం ఇదే..!

Chikkad Palli

Chikkad Palli

Hyderabad: ఇండియన్ ప్రీమియర్ లీగ్ క్రికెట్ ఫ్యాన్స్ ను జోష్ లో ముంచేస్తుంది. రోజుకో ట్విస్ట్ తో ఉత్కంఠ మైన మ్యాచ్ లు క్రికెట్ ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. అయితే ఒక వైపు క్రికెట్ ను ఎంజాయ్ చేస్తుంటే.. మరో వైపు బెట్టింగ్ రాయుళ్లు మాత్రం పందెలు పెడుతున్నారు. పందెం రాయుళ్లపై పోలీసులు ఎన్నిసార్లు దాడులు చేసిన వారు తీరు మాత్రం మారడం లేదు. కొంతమంది బెట్టింగ్ పెట్టేందుకు అప్పులు చేసి తిప్పలు పడుతున్నారు.. మరికొందరు చేసిన అప్పులు తీర్చలేక ఆత్మహత్యలే చేసుకుంటున్నారు. అయితే తాజాగా క్రికెట్ బెట్టింగ్ తో అప్పుల పాలైన ఓ యువకుడు వాటిని తీర్చే మార్గం లేక ఆత్మహత్య చేసుకున్నాడు. ఇలాంటి ఘటనే హైదరాబాద్ చిక్కడపల్లిలో చోటుచేసుకుంది.

Read also: G-20 Summit: జీ-20 దేశాల సమ్మిట్‌.. 120 ఎకరాల కన్వెన్షన్‌ సెంటర్‌ సిద్ధం

చిక్కడపల్లి బాయ్స్ హాస్టల్లో విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న ఘటన కలకలం రేపింది. ఐపీఎల్ క్రికెట్ బెట్టింగ్లతో అప్పుల పాలైన డిగ్రీ విద్యార్ధి సతీష్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. లక్కీ బాయ్స్ హాస్టల్లో ఫ్యాన్ కు ఉరి వేసుకున్నాడు. అయితే సతీష్ గదిలోకి వెళ్లి ఎంతసేపు బయటకు రాకపోయే సరికి తలుపు పగల గొట్టి చూడగా రూమ్ మెట్స్ షాక్ కు గురయ్యారు. లక్కీ బాయ్స్ హాస్టల్ యజమానికి సమాచారం ఇచ్చారు. అయితే అక్కడకు చేరుకున్న లక్కీ బాయ్స్ హాస్టల్ ఓనర్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు సతీష్ ను కిందికి దించారు. సతీష్ విజయవాడ లయోలా కాలేజీలో మూడో సంవత్సరం చదువుతున్నట్లు తెలిపారు. గత నెల రోజుల క్రితం నుంచి బాయ్స్ హాస్టల్ లో ఉంటున్నట్లు వెల్లడించారు. ఐపీఎల్ క్రికెట్ బెట్టింగ్ లో తీవ్రంగా నష్టపోయినట్లు గ్రహించారు. బెట్టింగ్ లో సతీష్ తీవ్రంగా నష్ట పోయి అప్పులపాలయ్యాడని పేర్కొన్నారు. అప్పులు తిరిగి చెల్లించలేక మానసిక ఒత్తిడికి గురైనట్లు వెల్లడించారు. దీంతో సతీష్ హాస్టల్లో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిపారు. సతీష్ కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చామని తెలిపారు. బెట్టింగ్ లకు నిండా మునిగి అప్పులపాలయ్యారని, ఇప్పటికైనా యువత బెట్టింగుల జోలికి వెళ్లకుండా జీవితాన్ని చిధిలం చేసుకోవద్దని పోలీసులు సూచించారు.
Emerging Asia Cup Final: టైటిల్ పోరులో భారత్‌-పాకిస్తాన్‌.. హాట్ ఫేవరెట్‌ ఏ జట్టు తెలుసా..?

Exit mobile version